India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండిహోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
జిల్లాలోని అన్ని గ్రామాల చెరువులను సాగర్ నీటి ద్వారా నింపాలని, నీరు వదలక పోతే నేరుగా రైతులతో వచ్చి గేట్లు బద్దలు కొడతామని నల్లగొండ పార్లమెంట్ BJP ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. గురువారం సాగర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని పరిశీలించి మాట్లాడారు. నీరు లేక గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం గ్రామాలలో చెరువులను నింపాలన్నారు.
SA-2 పరీక్షలు ఈనెల 15 కు వాయిదా వేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఈ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 18 వరకు ఉన్నాయి. కాగా హై స్కూల్ ఉపాధ్యాయులు స్పాట్ డ్యూటీలో ఉండటం మూలంగా ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావించిన విద్యాశాఖ అధికారులు ఈ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్ణయిస్తూ షెడ్యూల్ జారీ చేశారు.
లోక్ సభ ఎన్నికల సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, ఎన్నికల అధికారి హరిచందన అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉన్న FCI, BSNL, రైల్వే, వైద్య ఆరోగ్య, ట్రాన్స్పోర్ట్, TSSPDCL, తదితర శాఖల నోడల్ అధికారులతో పోస్టల్ బ్యాలెట్ పై సమీక్షించారు.
సూర్యాపేటలో ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడగా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఈ క్రమంలో నల్గొండ జిల్లా అత్యధికంగా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయాల్లో పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
దేవరకొండ నియోజకవర్గం మీదుగా డోర్నకల్, గద్వాల రైలు మార్గం కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ మార్గంలో సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో చింతపల్లి మండల సమీపంలో ల్యాండ్ మార్క్ వేశారు. కాగా ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల నెరవేరనుంది.
నల్గొండ ప్రభుత్వ డైట్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు గాదే శౌర్య రెడ్డి ఈరోజు వారి నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఎంతోమందిని వ్యాయామ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది, సమాజానికి కృషి చేసిన వ్యక్తి మరణించడం బాధాకరమని డైట్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. వారి అంత్యక్రియలు మఠంపల్లిలో నేడు జరగనున్నాయి.
బైక్ స్కిడ్ అయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో జరిగింది. తలకు బలమైన గాయాలు కావడంతో వద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాదు.
ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో నకిలీ ధ్రువపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న సుమారు 1,200 మంది ఆర్టిజన్ ఉద్యోగులలో కొంత మంది నకిలీ ధ్రువపత్రాలతో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో కొంతమంది విద్యార్హత లేకుండా నకిలీ ధ్రువపత్రాలతో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తూ బురిడీ కొట్టించారు. 11 మంది ఆర్టిజన్ ఉద్యోగుల ధ్రువీకరణ పత్రాలు నకిలీవిగా తేల్చారు.
Sorry, no posts matched your criteria.