India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నందికొండలో వాటర్ ట్యాంక్‌లో వానరాల కళేబరాల మృతి ఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థతి అన్నారు. తాగునీటి ట్యాంకుల శుభ్రత, నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలన అస్తవ్యస్తమైందని మండిపడ్డారు.
పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. NLGలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈ ప్రక్రియ చేపట్టారు. మూల్యాంకనం కోసం 92 మంది చీఫ్ ఎగ్జామినర్లను నియమించగా.. 72 మంది రిపోర్టు చేశారు. 551 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లకు గాను 452 మంది, 184 మంది స్పెషల్ అసిస్టెంట్లకు గాను 142 మంది రిపోర్టు చేసి మూల్యాంకనంలో పాల్గొన్నారు. మూల్యాంకనానికి హాజరు కాని వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఓ కారు వేగంగా వెనుక నుంచి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న బొజ్జ సామ్రాజ్యం(60) అనే మహిళా అక్కడికక్కడే మృతి చెందారు. సురేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మృతురాలిది ప్రకాశం జిల్లా కామినేని వారి పాలెంగా గుర్తించారు.
అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 12 మందిని నియమిస్తూ టిపిసిసి ఉత్తర్వులు జారీ చేసింది. DVK – కె. మంజులారెడ్డి, సాగర్ -మహేందర్ రెడ్డి. MLG – సల్ల నరేష్ కుమార్, HZNR- రేణుక, KDD- అల్లం ప్రభాకర్రెడ్డి, SRPT – కొల్లూరు పుష్పలీల, NLG – నిరంజన్ రెడ్డి, MNGD- వజ్ర సంధ్యారెడ్డి, BNG-శిరీష్ రెడ్డి, NKL-దుడం వెంకటరమణ నియమించింది.
మరికొన్ని గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు చనిపోయిన ఘటన రామన్నపేట మం. కక్కిరేణిలో జరిగింది. యాదయ్య, అంజమ్మ దంపతుల పెద్ద కుమారుడు నవీన్‌కు ఉత్తటూరుకు చెందిన బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఈ ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. కాగా నవీన్ నిన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెళ్లి కొడుకును చేసే టైం అవుతున్నా.. నవీన్ లేకపోవడంతో వెతకగా పొలం వద్ద విగతజీవిగా ఉన్నాడు. నవీన్ మృతి పెళ్లింట తీవ్ర విషాదం నింపింది.
కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై శివతేజ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన అమనగంటి ఎల్లమ్మ మృతిచెందగా, ఆనంతమ్మ , భారతమ్మ, పూలమ్మ, ఎల్లయ్య గాయపడ్డారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం కరవు చుట్టూ తిరుగుతోంది. సాగర్ కాల్వతో పాటు బోరు బావుల కింద పంటలు ఎండిపోవడానికి కారణం గత ప్రభుత్వమే అని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. తమ హయాంలో నీళ్లు ఇచ్చామని చెబుతూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరి మీరేమంటారు.
సైబర్ నేరాలకు గురైన బాధితుల నుంచి పిర్యాదు అందిన వెంటనే పోలీస్ స్టేషన్ల వారిగా నియమించిన సైబర్ వారియర్స్ తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి పోలీస్ సైబర్ వారియర్స్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ హాల్ నందు జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ల వారిగా నియమించిన సైబర్ వారియర్స్ కి మొబైల్ ఫోన్స్, సిమ్ కార్డ్స్ అందజేసి అనంతరం మాట్లాడారు.
నల్గొండలోని అద్దంకి నార్కెట్‌పల్లి బైపాస్ పై పానగల్ సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికు తెలిపిన వివరాల ప్రకారం.. షిఫ్ట్ కారును ధాన్యం ట్రాక్టర్ ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డాడు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో బాగంగా ప్రభుత్వ భవనాలు, స్థలాలలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని
జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ అతిథి గృహాలు, విశ్రాంతి గృహాలు, ప్రభుత్వ రంగ సంస్థల అతిథి గృహాలలో ఉంటూ ఏటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
Sorry, no posts matched your criteria.