Nalgonda

News March 21, 2024

బీబీనగర్ వద్ద రైలు కింద పడి మహిళ దుర్మరణం

image

బీబీనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు రైల్వే ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కిలోమీటర్ నెంబర్ 227/ 3-5 వద్ద ఎగువ లైన్లో 40 ఏళ్ల వయసు గల మహిళ రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. మృతురాలు తెలుపు రంగు చీర, పసుపుపచ్చ జాకెట్ ధరించారని వెల్లడించారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచామని తెలిపారు.

News March 21, 2024

నల్గొండ: భూగర్భ పైప్ లైన్ల ఏర్పాటుకు లైన్ క్లియర్

image

ఉమ్మడి జిల్లాలోని మూడు పురపాలికల్లో భూగర్భ మురుగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో 9, సూర్యాపేట జిల్లాలో 5, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరు పురపాలక సంఘాల్లో భూగర్భ మురుగునీటి పైప్ లైన్లు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఆయా మున్సిపాలిటీల్లో భూగర్భ మురుగునీటి పైపులైన్ల నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తి చేయనున్నారు.

News March 21, 2024

సూర్యాపేట: బ్యాంకు అధికారిపై కేసు నమోదు

image

రుణాల పేరుతో రూ.2.82 కోట్లు దోచుకున్న తాళ్లసింగారానికి చెందిన ఎస్బీఐ మేనేజర్ హరిప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు నూతనకల్ ఎస్సై సైదులు తెలిపారు. ప్రస్తుత మేనేజర్ రవీందర్ ఫిర్యాదు మేరకు.. నకిలీ రైతులు, వ్యాపారస్థులు, మహిళా సంఘాల పేరుతో రుణాలు మంజూరు చేసి తన ఖాతాలోకి నిధులు మళ్లించుకొని రూ.కోట్ల బ్యాంకు సొమ్ము కాజేసినట్లు రుజువు కావడంతో హరిప్రసాద్‌తో పాటు అతనికి సహకరించిన 14 మందిపై కేసు నమోదు చేశారు.

News March 21, 2024

NLG: అష్టకష్టాలు పడుతున్న పండ్లతోటల రైతులు

image

బోర్లలో నీరు అడుగంటడంతో ప్రస్తుతం నల్గొండ జిల్లాలో పండ్ల తోటలను రక్షించుకోవడానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోనే బత్తాయి సుమారు 60 వేల ఎకరాల్లో, నిమ్మ 20 వేల ఎకరాల్లో ఉన్నాయి. రూ. లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో తోటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

News March 21, 2024

సూర్యాపేట: బాలికపై అత్యాచారం.. 10 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికను బంధించి అత్యాచారం చేసిన వ్యక్తికి రాజేంద్రనగర్‌లోని ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష వేసింది. జడ్జి ఆంజనేయులు తీర్పు వెలువరించారు. హుజూర్‌నగర్‌కు చెందిన బాలిక కుటుంబం గచ్చిబౌలి వినాయక‌నగర్‌లో ఉంటోంది. బాలికపై అక్కడే నివసించే శివకృష్ణ కన్ను పడింది. 2014 అక్టోబర్ 20న ఇంట్లో నిద్రిస్తున్న బాలికను శివకృష్ణ  కిడ్నాప్ చేసిన అత్యాచారం చేశారు. తాజాగా కోర్టు తీర్పునిచ్చింది. 

News March 21, 2024

ధాన్యం దారులన్నీ మిర్యాలగూడ వైపే..

image

ఉమ్మడి నల్గొండ ధాన్యం దారులన్నీమిర్యాలగూడ వైపే వెళ్తున్నాయి. సన్నరకాల కొనుగోలు ఎక్కువగా ఉండడంతో రైతులు అక్కడికి ధాన్యం తరలిస్తున్నారు. ఇక్కడ దాదాపు 115 మిల్లులు ఉండడం, ధర అనుకూలంగా ఉండడంతో రైతులు మిర్యాలగూడకే తీసుకొస్తున్నారు. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి వరకు, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అటు సాగర్ నుంచి కోదాడ వరకు సాగైన సన్నాలు తరలివస్తున్నాయి.

News March 21, 2024

MLG: మిల్లర్లపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్

image

రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లించకుండా.. సకాలంలో కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేసే మిల్లులను సీజ్ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. MLG మహర్షి రైస్ మిల్ వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆగి వారి వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారులను పంపి పరిస్థితిని సమీక్షించాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

News March 21, 2024

ఓటర్ జాబితాలో ముందే పేర్లు చూసుకోవాలి : కలెక్టర్

image

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో వారి పేర్లను ముందే చూసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిచందన కోరారు. బుధవారం ఆమె నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో ఏర్పాటు చేయనున్న పార్లమెంటు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రం సైతం ఎక్కడుందో చూసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

News March 20, 2024

NLG: ‘నిజంగా SI లానే ఆమె చేసేది’

image

HYDలో RPF SI అంటూ నార్కెట్‌పల్లి యువతి మాళవిక అందరినీ నమ్మించగా ఆమెను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే నిజంగా SIలానే ఆమె చేసేదని స్థానికులు తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, మోటివేషన్ క్లాసులకు వెళ్లి స్పీచ్‌లు ఇస్తూ SIలానే ప్రవర్తించేదని చెప్పారు. ఏడాదిగా నకిలీ పోలీస్ యూనిఫాం వేసుకుని తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడం గమనార్హం. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 20, 2024

నల్గొండ: కారు బీభత్సం

image

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో కారు బీభత్సం సృష్టించింది. భట్లపల్లి గ్రామంలో అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలైయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.