India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రూప్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్, RRB, SSC, రాష్ట్రస్థాయి, కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు ఉచిత వసతి, శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం ఈనెల 4న నల్గొండలోని విశ్వదీప్ విద్యాపీట్ హైస్కూల్‌లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NLG: ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎలాంటి సమస్యలు రాకుండా లోకసభ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. మంగళవారం ఆమె నల్గొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లోకసభ ఎన్నికల విధుల నిర్వహణకు నియమించబడిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
నల్గొండ జిల్లాలో గాంజయి, డ్రగ్స్ రవాణా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విడుదల చేసిన గంజాయి, కల్తీ కల్లుని నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుదాం అనే పోస్టర్ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపీడ అన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం లోక్ సభ ఎన్నికల పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటిరోజు శిక్షణ కార్యక్రమానికి మొత్తం 4740 మంది హాజరు కావాల్సి ఉండగా 4064 మంది మాత్రమే హాజరయ్యారు. 676 మంది శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరు కావడంతో వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. నేడు ఆత్మకూర్ పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎండ తీవ్రతతో వడదెబ్బకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పిహెచ్సీ పరిధిలోని గ్రామ ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.
మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందస్తు అనుమతి లేనిదే ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. ప్రచారాలకు ఉపయోగించే వాహనాలు, మైకులకు ముందస్తుగా నోడల్ అధికారి అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, విద్యాలయాలు, ప్రార్థన మందిరాల్లో సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ సీట్లు మనవే అని నల్గొండలో నిర్వహించినBRS సన్నాహక సమావేశంలో KTR అన్నారు. ‘నల్గొండ, మిర్యాలగూడ, కోదాడను ఎంతో అభివృద్ధి చేశాం. మూడు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. జిల్లాలో ఫ్లోరోసిస్ రూపుమాపడంతోపాటు సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లు తెచ్చాం. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోలేకపోయాం. NLG కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలున్నారు’ అన్న KTR వ్యాఖ్యలపై మీ కామెంట్..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హత్యలు, దందాలు, బెదిరింపులు, అక్రమ వ్యాపారాలు ఇతర నేరాలకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 5,936 మంది పాత నేరస్థులను పోలీసులు గుర్తించారు. రౌడీ షీటర్లుగా ఉన్న వారు, గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారి వివరాలు సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు ఈ ఏడాది మామిడి మహా ప్రియం కానుంది. సీజన్ లేట్‌గా ప్రారంభమైంది. పంట ఆలస్యం కావడం.. తక్కువ దిగుబడి రావడమే కారణం. దీంతో మామిడి ప్రియుల జేబులు ఖాళీ కానున్నాయి. ఎందుకంటే హోల్‌సేల్ మార్కెట్‌లోనే మామిడి పండ్ల ధరలు కేజీ రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతున్నాయి. జిల్లాలో ఈసారి కాత ఆశించినంత లేకపోవడంతో దిగుబడి తగ్గింది. దీంతో ధరలు కూడా భగ్గుమంటున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్న సమయంలో నిప్పులు కురిపిస్తుండటంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. సోమవారం మాడ్గులపల్లి మండలంలో 43.0 డిగ్రీలు, చింతపల్లి మండలం గొడకండ్లలో 37.6 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మునగాల మండలంలో 42.2 డిగ్రీలు, తుంగతుర్తి మండలంలో 36.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.