Nalgonda

News March 19, 2024

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

image

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలు వసూళ్లకు తప్ప పాలించడానికి పనికిరారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100రోజులుగా బీఆర్ఎస్‌పై విమర్శలకే పరిమితం అయ్యారన్నారు. CM రేవంత్ గేట్లు తెరిచినా బీఆర్ఎస్‌కు ఏమీ కాదని అభిప్రాయపడ్డారు. తాము టికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన వారినే కాంగ్రెస్‌, బీజేపీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

News March 19, 2024

NLG: గృహజ్యోతి దరఖాస్తులకు బ్రేక్

image

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గృహజ్యోతి దరఖాస్తులకు బ్రేక్ పడింది. గృహజ్యోతి దరఖాస్తులు అందజేసేందుకు సోమవారం ఉమ్మడి జిల్లాలోని ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు దరఖాస్తులు స్వీకరించలేదు. దీంతో రోజంతా పడిగాపులు కాసి దరఖాస్తుదారులు తిరుగు ప్రయాణమయ్యారు. కోడ్ ముగిసే వరకు దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు తెలిపారు.

News March 19, 2024

NLG: కారులో తర్జనభజన.. పోటీకి ముందుకు రాని అభ్యర్థులు!

image

ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ముందునుంచి టికెట్ ఆశించిన వారు.. ఇప్పుడు పోటీచేయబోమని చెప్పేయగా, మరొకరికి టికెట్ ఇద్దామని పార్టీ ఆలోచిస్తే.. ఆయన పార్టీ మారుతారన్న చర్చ జరుగుతోంది. భువనగిరి టికెట్ ను బీసీలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా తర్జనభర్జన పడుతోంది.

News March 19, 2024

NLG: తొలిరోజు 151 మంది గైర్హాజరు

image

పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 109 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 19, 326 మంది విద్యార్థులకు గాను 19, 175 మంది పరీక్షకు హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ హరిచందన జిల్లా కేంద్రంలోని డైట్ ప్రభుత్వ పాఠశాలతో పాటు దేవరకొండ రోడ్డులోని సెయింట్ ఆల్ఫోన్సెస్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

News March 19, 2024

నల్గొండ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తి హత్య

image

గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి వ్యవసాయ బావిలో పడవేశారు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి శివారులో వెలుగు చూసింది. అనిశెట్టి దుప్పలపల్లి శివారులో సక్కుబాయికి చెందిన వ్యవసాయ భూమిని పవన్ కౌలు చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం బోరు బావిలో పరిశీలిస్తుండగా నీటిపై మృతదేహం తెలియాడడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు.

News March 19, 2024

NLG: కొనసాగుతున్న ఇంటర్ మూల్యాంకనం

image

ఇంటర్ మూల్యాంకనం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి NLG ప్రభుత్వ జూ. కళాశాల (బాలుర)లో మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో ముగియనుంది. వివిధ జిల్లాల నుంచి ఐదు లక్షల పేపర్లు మూల్యాంకనం కోసం జిల్లాకు వచ్చాయి. మ్యాథ్స్ 180, ఇంగ్లిష్ 165, తెలుగు 140, సివిక్స్ 75 సంస్కృతం 40, హిందీ సబ్జెక్టు ను ఐదుగురు అధ్యాపకులు మూల్యాంకనం చేస్తున్నారు.

News March 19, 2024

నల్గొండ జిల్లాలోనే సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

image

లోక్‌సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార యంత్రాంగాలు కసరత్తు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు యంత్రాంగం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలును గుర్తించింది. ఒక్క నల్గొండ జిల్లాలోనే మొత్తం 1766 పోలింగ్‌ కేంద్రాలకు గానూ.. 439 పోలింగ్‌ కేంద్రాలను సమస్మాత్మకమైనవిగా తేల్చగా.. మరో 247 ప్రాంతాలను ఘర్షణ జరిగే ప్రాంతాలుగా గుర్తించారు.

News March 19, 2024

బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై సమాచారం అందించాలి: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎన్నికల వ్యయనిర్వహణలో భాగంగా ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ సమావేశంలో ఆమె బ్యాంకర్లతో మాట్లాడారు.

News March 18, 2024

విద్యుత్ షాక్ కు గురై రైతు మృతి

image

విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన బీబీనగర్ మండల పరిధిలోని పెద్దపలువు తండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిచ్యా అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన పొలంవద్ద బోర్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ గురైయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 18, 2024

రూ.5.73 కోట్ల విలువగల బంగారం పట్టివేత: ఎస్పీ 

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ముమ్మర తనిఖీలు చేపట్టిందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఈరోజు మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తా వద్ద డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న  బొలెరో వాహనం ఆపి తనిఖీ చేయగా.. రూ.5.73 కోట్ల బంగారం పట్టుకున్నట్లు తెలిపారు.