India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెద్దవూర మండలంలో కొండమల్లేపల్లి వైపు నుంచి వచ్చిన వాహనాలను పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన తాతారావు రూ.1.50 లక్షలు, కృష్ణ జిల్లాకు చెందిన ఎర్రగడ్డ నవీన్ రూ.50వేలు, అనకాపల్లి జిల్లాకు చెందిన కొండల దుర్గారావు రూ.1లక్షల నగదుకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి 30 రోజుల పాటు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిదే ప్రజలు, ప్రజా ప్రతినిధులు రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని కోరారు. ఎన్నికల నిబంధనలకు అందరూ సహకరించాలని సూచించారు.
భానుడి ప్రతాపంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవి భగభగలతో బెంబేలెత్తుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే క్రమేణా పెరుగుతున్నాయి. మూడు రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడుగులపల్లి మండలంలో సండే రోజు అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో దాదాపు 1500 గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడనున్నట్లు అధికారులు ముందస్తుగా గుర్తించారు. నల్గొండ జిల్లాలో 788, సూర్యాపేటలో 412, యాదాద్రి భువనగిరిలో 300 ఆవాసాల్లో తాగు నీటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ముందస్తు ప్రణాళికలో గుర్తించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో తాగునీటి ఎద్దడి నివారణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. నల్లగొండ, భువనగిరి పార్లమెంటుకు ఏఐసీసీ తరఫున ఇన్‌ఛార్జిగా రోహిత్ చౌదరిని నియమించారు. నల్గొండకు ఇన్‌ఛార్జ్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా నియమించారు.
తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు ఈరోజు నీటిని విడుదల చేయనున్నారు. నల్లగొండ జిల్లాలోని పెద్దదేవులపల్లి, ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్లను నింపడానికి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎన్ఎస్పీ అధికారులకు ఎస్సీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. కేవలం తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్టు సమాచారం.
నల్గొండ జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1నుండి 30 వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు.
నల్లగొండ: వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో చిన్న పిల్లలు, యువకులు ఈత సరదా కొరకు వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలనీ, బావులు, చెరువులు, కాల్వల వద్ద ఈత చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పాఠశాలలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, పిల్లలు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్తుంటారని తెలిపారు.
పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ శివారులోని దివ్యబాల హైస్కూల్లో ఏప్రిల్ 3 నుంచి 11 వరకు స్పాట్ వాల్యుయేషన్ జరగనుంది. 9రోజుల వ్యవధిలో 1,48,000 జవాబు పత్రాలను దిద్దనున్నారు. పత్రాలను దిద్దేందుకు 600 అసిస్టెంట్ ఎగ్జామినర్లను , 200 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. ప్రతిరోజు ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్కు 40 పేపర్లు దిద్దేందుకు ఇవ్వనున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ జనగామ పర్యటనలో భాగంగా భువనగిరి నుంచి అభివాదం చేసుకుంటూ బయలుదేరారు. మాజీ సీఎంకు ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి స్వాగతం పలికారు.
Sorry, no posts matched your criteria.