India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. దేవరకొండ మండలం మైనంపల్లి స్టేజి వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చందంపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు బైక్‌పై వెళుతున్నాడు. ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
సారా కాస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్తే పోలీసులపైనే దాడి చేసిన ఘటన చింతలపాలెం మండలం కొత్తగూడెం తండాలో జరిగింది. ఆబ్కారీ ఎస్సై దివ్య ఇటీవల తనిఖీ చేయగా.. తులసీరాం ఇంట్లో నల్లబెల్లం పట్టుబడింది. నిందితుడు దొరకలేదు. కేసు నమోదు చేశారు. అతణ్ని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మూడు నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని గత ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చిందా అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. కేటీఆర్ అధికారం కోల్పోయిన బాధతో ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. కరువు యాత్రల పేరుతో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు.
ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం అయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, అధికారులు పాల్గొన్నారు.
భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. “తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు వందల ఎకరాలు ఉన్నాయి. రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి రాలేదు. ప్రజా సేవ చేసేందుకు వచ్చాను. పార్లెమెంట్ అభ్యర్థిగా ఆశీర్వదించండి” అని కోరారు. జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సునీత, కిశోర్ పాల్గొన్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణపట్టి తీరాన్ని ఆవరించి ఉన్న వైజాగ్‌కాలనీ పర్యాటకులను ఆకర్షిస్తుంది. నేరెడుగొమ్ము మండలంలోని వైజాగ్‌కాలనీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. సాయంత్రం వేళ.. ఆకర్షణీయంగా ద్వీపకల్పంలా కనువిందు చేస్తున్నాయి. మూడు దిక్కుల నీరుండి మధ్యలో వైజాగ్‌కాలనీ గ్రామం ఉండడంతో ద్వీపకల్పాన్ని తలపిస్తుంది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్లేనని పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది. ఎంపీ ఎన్నికలు పూర్తైన తర్వాత మంత్రి పదవి ఇచ్చేలా అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే BNG ఎంపీగా కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించాలని పార్టీ ఒత్తిడి చేసినా, అందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా చామల పేరును అధిష్ఠానం ప్రకటించింది.
సంస్థాన్ నారాయణపురం మండలంలో పొట్ట మీద ఉన్న పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటలు పడుతున్నారు. ఎప్పటిలాగే పంటలు పండుతాయి అనే నమ్మకంతో పంట సాగు చేశారు. ఎండ తీవ్రతకు భూగర్భ జలాలు పడిపోయి రోజురోజుకు బోర్లలో నీళ్లు తగ్గుతుండడంతో పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరు పోయాల్సి వస్తుందని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. మండలంలో కొన్నిచోట్ల పైరుకు నీరు అందక పంటను పశువులకు మేపుకుంటున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ రేపు తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ఎద్దడి కారణంగా ఎండిపోయిన పంటలను పరశీలించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తుంగతుర్తి , హాలియా ప్రాంతాల్లో పర్యటిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
వరకట్న వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం నాగులపాటి అన్నారంలో జరిగింది. ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అయోధ్య కుమార్తె చందన(23)కు మిర్యాలగూడకు చెందిన ఆనందం వేణుతో 2021లో వివాహం జరిగింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని వేధిస్తుండడంతో చందన సూసైడ్ చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.