India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చండూరు మండలం ఇడికూడ పంచాయతీ సెక్రటరీ సైదులు సస్పెండ్ అయ్యారు. గతంలో ఆయన చండూరు మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్న సమయంలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో కలెక్టర్ సైదులును సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రైతు రుణమాఫీకి ప్రభుత్వం ఎట్టకేలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను బ్యాంకర్లకు అప్పగించింది. రూ.2లక్షల వరకు రుణం మాఫీ కానుండగా, ఆగస్టు 15వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయనుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5.36 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
MG యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పూర్వ విద్యార్థులకు వన్ టైం చాన్స్ ద్వారా పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కంట్రోలర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. 2011 – 12 నుంచి సంవత్సరం వారీగా అభ్యసించినవారు, 2014- 15 నుంచి 2020 వరకు సెమిస్టర్ విధానంలో చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను వారు అభ్యసించిన కళాశాలలో ఈ నెల 30లోగా అందజేయాలన్నారు.
అనుమానాస్పద స్థితిలో ఐదవ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన పెన్‌పహాడ్ మండలం దోసపాడు గురుకుల పాఠశాలలో జరిగింది. నూతనకల్ మండలం మాచనపల్లికి చెందిన సోమయ్య-నవ్య దంపతుల కూతురు సరస్వతి బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది. ఈరోజు ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నల్గొండ జిల్లాలో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో అత్యధికంగా CTL మండలంలో 18.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అనుములలో 0.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. SLGలో 15.5, NKPలో 15.1, మర్రిగూడ 6.9, గట్టుప్పల్ 4.5, KTGR 4.3, చింతపల్లి 3.5, CDR 3.3, NLG 2.8, మునుగోడు 2.6, తిప్పర్తి 2.3, గుండ్లపల్లి 2.2, గుర్రంపోడు 1.8 మీ.మీ వర్షం పడింది.
NLG: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను ఒకటికి రెండుసార్లు చదివి, ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.
గ్రామీణ ప్రాంత ఆవిష్కర్తలకు సాధికారత కల్పించడంలో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో రూపొందించిన “ఇంటింటా ఇన్నోవేషన్” గోడపత్రికను కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఆవిష్కర్తలు ఆగస్టు 3లోగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సెల్ ఫోన్ నెంబర్ 9100678543 నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించాలని ఆయన అన్నారు.
10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. నల్గొండ డివిజన్‌లో 81, సూర్యాపేట డివిజన్‌లో 62 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPMకు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి కసరత్తు చేస్తోంది. ఇందుకు ఉమ్మడి నల్గొండ సహకార సంఘాల పరిధిలో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా అర్హులైన రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు పంట రుణమాఫీ పొందే అవకాశం ఉంది. దీంతో రైతుల సంతోషంలో ఉన్నారు.
నార్కట్‌పల్లి మండలం గోపాలయపల్లి గ్రామంలో శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి వారి ఆలయంలో సోమవారం సుదర్శన యాగ సహిత రుద్రయాగం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.