India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నార్కట్పల్లి మండలం గోపాలయపల్లి గ్రామంలో శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి వారి ఆలయంలో సోమవారం సుదర్శన యాగ సహిత రుద్రయాగం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి కసరత్తు చేస్తోంది. ఇందుకు ఉమ్మడి నల్గొండ సహకార సంఘాల పరిధిలో రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా అర్హులైన రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఉమ్మడి జిల్లాలో 5.36 లక్షల మంది రైతులు పంట రుణమాఫీ పొందే అవకాశం ఉంది. దీంతో రైతుల సంతోషంలో ఉన్నారు.
బోడ కాకరను సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో ఏ కూరగాయలకు లేని ధర దీనికి ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని కూరగాయల మార్కెట్లో కిలో బోడ కాకర రూ.460 వరకు ధర పలుకుతోంది. ఇందులో ఆరోగ్యానికి అవసరమయ్యే ఔషధ గుణాలు ఉంటాయి. ఏటా జులై, ఆగష్టు రెండు నెలలు మాత్రమే పడుతుండటంతో దీనికి డిమాండ్ ఉంటుంది.
ఓ యువకుడు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల, స్థానికుల వివరాలు.. వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి శంకరయ్య- శ్యామల దంపతుల రెండో కుమారుడు శివ(20) ఇంటీ వద్దనే ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నాడు. రోజు పని దొరకకపోవడంతో ఆర్థిక సమస్యతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. శివ తండ్రి గత ఏడాది భర్త, ఇప్పుడు కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లి శ్యామల కన్నీరుమున్నీరవుతోంది.
చౌటుప్పల్ పరిధిలోని లక్కారం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి వివరాలు.. ఒడిశాకు చెందిన కంటైనర్ HYD-విజయవాడ వెళ్తుంది. లక్కారం వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన గూడ్స్ ఆటో కంటైనర్ను.. హైవే రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెంకు చెందిన ప్రకాశ్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. కేసు నమోదైంది.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి బడి ఈడు పిల్లలను బడిలోనే ఉంచాలనే ఉద్దేశంతో NLG జిల్లాలో ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ స్మైల్-10 పూర్తికాగా ఈ నెల 1 నుంచి ఆపరేషన్ ముష్కాన్ కొనసాగుతోంది. జిల్లాలోని పలు పరిశ్రమలు, దుకాణాలు ఇతర ప్రదేశాల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్న 34 మంది బాల కార్మికులను గుర్తించి పనుల నుంచి విముక్తి కల్పించారు.
ఒకప్పుడు పల్లె వెలుగుల బస్సుల రాకపోకలతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడేవి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తుండడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా బస్సులను కుదించడంతో అటు ప్రజలు, రైతులు ఇటు కళాశాల, స్కూల్ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో శాలిగౌరారం మండలంలో అనేక మంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆదివారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డికి జిల్లా ఎస్పీ పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా ఎస్పీకి సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
NLG: పట్టణ ప్రజలు కలుషిత తాగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్న సాగర్ వాటర్లో పురుగులు, చెత్త చెదారం వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పానగల్ వద్ద మిషన్ భగీరథ నీళ్లను ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ సరఫరా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మందుల సామేలు పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేలు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.