India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ ఉద్యమకారుడు, BRS నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా తనదైన పాత్ర పోషించారు. గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

నల్గొండ జిల్లాలో హిజ్రాల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో టోల్ ప్లాజాల వద్ద హిజ్రాలు తిష్ట వేసి తమను బెదిరించి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే దుర్భాషలాడుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

వాతావరణంలో మార్పులు, అధ్వానపు పారిశుద్ధ్య పరిస్థితులతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేటల్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది 416 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. నల్గొండ జిల్లాలో 340 కేసులు నమోదైనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

యాదగిరిగుట్ట శ్రీవారి కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్దిని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉ.9గం లకు మహా చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. హోమంలో రూ.1250 టికెట్ పొంది భక్తులు పాల్గొనవచ్చు. హోమంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి అభిషేక లడ్డు, శాల్ల, కనుమ ప్రసాదంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

నూతన రెవెన్యూ చట్టం ఆర్వోఆర్– 2024 ముసాయిదా అమలుపై ఇవాళ కలెక్టరేట్ కార్యాలయంలో చర్చ వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం తెలిపారు. అన్నీ వర్గాల నుంచి విస్తృత అభిప్రాయాలు స్వీకరించాలనే లక్ష్యంతో చర్చ కార్యక్రమం నిర్వహణ చేపట్టనున్నట్ల పేర్కొన్నారు. ప్రజా ప్రతినిదులు, న్యాయవాదులు సీనియర్ పాత్రికేయులు సూచనలు అందించాలని తెలిపారు.

యాదగిరిగుట్ట ఆలయంపైన మాడవీధుల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే లు పూజలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆలయ ఈవో భాస్కరరావు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అనుమతి లేని ప్రదేశంలో బీఆర్ఎస్ నేతలు బయటి పూజారులతో మాడవీధుల్లో పూజలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్ 7 రిలీజియన్ యాక్ట్- 1988 ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.

పంచాయతీ పోరుకు పల్లెలు సై అంటున్నాయి. అసెంబ్లీ ఓటరు జాబితాను జీపీకి కన్వర్ట్ చేయాలని సర్కారు ఆదేశాలతో సర్పంచ్ బరిలో నిలిచే ఆశావహులు తెరపైకి వస్తున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యలో ఉంటున్నారు. రిజర్వేషన్ల లెక్క తేలక ముందే.. బరిగీసి కొట్లాడేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆపద సమయంలో నేనున్నానంటూ ఆర్థిక సాయం చేస్తూ పోటీదారులతో బలాబలాలు తేల్చుకునే పనిలో నిమగ్నమవుతున్నారు.

చౌటుప్పల్ కు చెందిన నిల్లిగొండ సైదులు ఏటా మట్టి గణేశ్ విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు తమవంతుగా కృషి చేస్తున్నారు. బీఎస్సీ చదివి స్వయం ఉపాధిగా కులవృత్తిని ఎంచుకున్న సైదులు.. సొంతూరిలో కుండలతో పాటు గ్రామ దేవతల విగ్రహాలు, పూజకు అవసరమయ్యే వస్తువులను మట్టితో తయారు చేస్తూ పర్యావరణహితుడిగా పేరు పొందాడు. ఈ ఏడాది 20 వేల మట్టి గణపతి విగ్రహాలను తయారు చేసినట్లు తెలిపారు.

సాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరి నిండుకుండలా కనిపిస్తోంది. బుధవారం శ్రీశైలం జలాశయం నుంచి 47,650 క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరింది. సాగర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8144 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 8280, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 28826, SLBC ద్వారా 1800, వరద కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు విటులను, నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. HZNR పట్టణంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరు విటులను, నిర్వాహకురాలిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ ఫోన్లు, 3 మోటారు సైకిళ్లు. రూ.1700 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.