India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఇసుక అవసరమైన వారు శాండ్ ట్యాక్స్ ద్వారా బుక్ చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం ఆయన నల్లగొండ నుంచి గుర్రంపోడు వెళ్తూ మార్గమధ్యలో మావిళ్లగూడెం, పర్వతగిరి గ్రామాల మధ్య వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను ఆపి అనుమతులు, లైసెన్స్, తదితర రశీదులను తనిఖీ చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

నియోజక వర్గాల వారిగా ఎంపిక చేసిన ప్రత్యేక పాఠశాలల్లో గుణాత్మక విద్య అందించడం ద్వారా ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో కనీసం 50 శాతం మంది విద్యార్థులు 10కి10 జీపీఏ సాధించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఉదయాదీత్య భవన్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంపిక చేసిన పాఠశాలల్లో గుణాత్మక విద్యపై జిల్లా అధికారులు, సంబంధిత ఎంఈఓ, హెచ్ఎం, టీచర్లతో సమావేశం నిర్వహించారు.

కొప్పోలులో పశు వైద్య ఉపకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. లైవ్ స్టాక్ అసిస్టెంట్ మట్టయ్య విధులకు సరిగా రావడం లేదని, పశువులకు చికిత్స అందించడం లేదని గ్రామస్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే లైవ్ స్టాక్ అసిస్టెంట్ మట్టయ్యను విధుల నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు.

భువనగిరిలోని రూరల్ పోలీస్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ మెట్టు మధుసూదన్ రెడ్డి భార్య విజయలక్ష్మి (35) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మధుసూదన్ రూరల్ పోలీస్ స్టేషన్లో రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన లంచ్ చేయడానికి ఇంటికి వెళ్లగా విజయలక్ష్మి విగతజీవిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న మృతదేహాన్ని పోలీసులు కిందకు దింపారు.

నిడమనూరు మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న టి.స్వప్న ప్రసవం కోసం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అడ్మిట్ అయి ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వైద్య సిబ్బంది పనితీరు పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రి అంటే పునర్జన్మ ఇచ్చే దేవాలయం అని అన్నారు. ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలపై కలెక్టర్‌కి నివేదిక ఇస్తానన్నారు.

శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి రాజకీయ బాటలో ఆయన తనయుడు అమిత్‌రెడ్డి పయనిస్తున్నారు. ప్రభుత్వం అమిత్‌రెడ్డిని తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థకు ఛైర్మన్‌గా నియమించింది. ఉమ్మడిఆంధ్రప్రదేశ్ టీడీపీప్రభుత్వంలో గుత్తా ఇదే పదవిని నిర్వహించారు. ప్రస్తుతం అదే పదవి అమిత్‌ను వరించింది. ఈ పదవిని సుఖేందర్‌రెడ్డి నిర్వహించిన వయసులోనే అమిత్‌రెడ్డికి దక్కడం గమనార్హం.

రక్షా బంధన్ పర్వదినం ఆర్టీసీకి కలిసొచ్చింది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో ఈ నెల 17 నుంచి 19 వరకు మొత్తం రూ.6.46 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ మూడు రోజుల్లో మొత్తం 9,82,355 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. మొత్తం రీజియన్ పరిధిలో ఈ నెల 17న రూ.1.89కోట్లు, 18న రూ.2.02కోట్ల ఆదాయం రాగా.. అత్యధికంగా ఈనెల 19న రూ.2.55కోట్ల ఆదాయం వచ్చింది.

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ ,ఆస్తి నష్టం జరగకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఖమ్మం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో భారీ వర్షాలు, ధరణి, నూతన రెవిన్యూ చట్టంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్డిఓలకు తహశీల్దార్లకు స్పెషల్ సమ్మరి రివిజన్ (SSR )పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారు.

తెలంగాణ పాల సహకార సంఘం ఛైర్మన్‌గా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి నియమితులయ్యారు. గుత్తా కుటుంబం కొన్ని దశాబ్దాలుగా డైరీ రంగంలో ఉండటంతో, ఆ అనుభవం రాష్ర్ట స్థాయి పదవిని నిర్వహించడానికి ఉపయోగకరంగా ఉంటుందని రాష్ర్ట ప్రభుత్వ భావనగా చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.