India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రక్షా బంధన్ సందర్భంగా RTC నల్లగొండ రీజియన్లో 128 ఆక్యుపెన్సీ రేషియో, 76.26 ఎర్నింగ్ పర్ కిలోమీటర్తో 3,78,982 మంది ప్రయాణించారని ఉమ్మడి నల్గొండ రీజినల్ మేనేజర్ M. రాజశేఖర్ మంగళవారం తెలిపారు. ఇందులో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారని, దీని ద్వారా రికార్డు స్థాయిలో రూ. 2,23,20,254 రాబడి వచ్చిందన్నారు. ఆ చరిత్రలో ఇది అల్ టైం రికార్డ్ అని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించామన్నారు.

ఓటరు నమోదు కోసం ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ, యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు చేయించనున్నారు.

జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుండి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గట్టుపల్ మండల పరిధిలోని పుట్టపాక – గట్టుపల్ మధ్యలో వాగు పొంగిపొర్లుతుంది. నారాయణపురం మండలం లచ్చమ్మ గూడెం-గట్టుప్పల్ మధ్యలో.. ధర్మతండా మధ్యలో కల్వర్టులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమళ్ల గ్రామానికి చెందిన అక్కినపల్లి రాములు, పూలమ్మ కుమారుడు అక్కినపల్లి సుధాకర్ సినీ రంగంలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈయనది నిరుపేద కుటుంబం. జీవనోపాధి కోసం తల్లిదండ్రులతో పాటు HYD వెళ్లిన ఆయన చదువు మానేసి ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నారు. ముందు టీవీ ఛానళ్లలో అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేసి, 2019 నుంచి సినీరంగంలో పనిచేస్తున్నారు.

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో జాతీయ రహదారులపై R&B శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు జాతీయ రహదారుల నిర్మాణాల స్థితిగతులపై ఆరా తీసి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. NH-65ని 6 లేన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ ను తయారు చేసేందుకు కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు పిలిచామన్నారు.

బైక్ చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందిన ఘనట పేరేపల్లి శివారులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం… చిట్యాల మండలం పేరేపల్లికి చెందిన రూపని రాజశేఖర్ జేసీబీ డ్రైవర్. వెలిమినేడులో పని ముగించుకుని గ్రామానికి తిరిగి వెళుతుండగా పేరేపల్లి శివారులో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు రాముడి ఫిర్యాదుతో ఏఎస్ఐ జానారెడ్డి కేసు నమోదు చేశారు.

నాగార్జునసాగర్ నెల్లికల్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో పగడాల సుధాకర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వేములపల్లి మండలం శెట్టిపాలెంకి సుధాకర్ ఓ కంపెనీలో క్యాష్ డిపాజిటర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏటీఎంలో మనీ డిపాజిట్ చేసే క్రమంలో రూ.20లక్షలతో ఈ నెల 13న ఉడాయించాడని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేశారు. ఫారెస్టులో ఇవాళ శవమై తేలాడు.

గ్రామానికి కీడు సోకిందని ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి వన వాసానికి వెళ్లిన ఘటన NKL మండలం మంగళపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామంలో నెల రోజులుగా కొందరు జ్వరాల బారిన పడుతున్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించినా తగ్గుముఖం పట్టడం లేదు. దీంతో గ్రామానికి కీడు సోకిందని.. భావించి సగం ఊరు ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి ఉదయం వనవాసం వెళ్లి తిరిగొచ్చారు.

నాగార్జునసాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగింది. శ్రీశైలం నుంచి 71,259 క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరగా సాగర్ నుంచి రెండు గేట్లను ఎనిమిది అడుగుల మేరకు ఎత్తి 24,920 క్కూసెక్కుల నీటిని దిగువ విడుదల చేశారు. గేట్లతో పాటు కుడికాల్వ ద్వారా 8,067, ఎడమకాల్వ ద్వారా 6,478 , ప్రధాన విద్యుత్తు కేంద్రం ద్వారా 29,394, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

జిల్లాలో రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ను ఏర్పాటు చేసి ఒక్కోదానికి రూ.22 లక్షలు ఖర్చుచేసి జిల్లా వ్యాప్తంగా మొత్తం 140 రైతు వేదికలు నిర్మించారు. వారం వారంవ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు శిక్షణలు ఇస్తూ సీజన్ లో పంటల వారీగా సాగులో మెలకువలను తెలియజేయాలనేది వీటి లక్ష్యం. కాగా 24 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావడం లేదు
Sorry, no posts matched your criteria.