Nalgonda

News March 17, 2024

తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పటేల్ రమేష్ రెడ్డి

image

సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డిని కార్పొరేషన్ ఛైర్మన్‌ పదవి వరించింది. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించి బంగపడ్డ ఆయనకు, నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి రఘువీర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనను తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News March 17, 2024

పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్ హరిచందన

image

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఈనెల18న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరి చందన ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని ఆమె పేర్కొన్నారు. 

News March 16, 2024

చిట్యాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

చిట్యాలలోని భువనగిరి రోడ్డులో ప్రమాదం జరిగింది. చిట్యాల ఎస్సై సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుదాటుతున్న రాములు అనే వ్యక్తిని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. జగిత్యాలకు చెందిన వీరు కుమార్తె చికిత్స కోసం చిట్యాల వచ్చారు.

News March 16, 2024

ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి

image

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శనివారం అయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో పార్లమెంటు ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News March 16, 2024

సూర్యాపేట: కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

image

కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో గరిడేపల్లి మండలం మర్రికుంట దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో మట్టంపల్లి మండలం బిల్లా నాయక్ తండాకు చెందిన నవీన్ మృతి చెందాడు. గరిడేపల్లి నుండి సూర్యాపేట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2024

నిబంధనలను పకడ్బందీగా అమలుచేయాలి: కలెక్టర్

image

ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని యాదాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారం భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో ఆయన కలెక్టరేట్లో వివిధ విభాగాల నోడల్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ శాలొం పాల్గొన్నారు.

News March 16, 2024

NLG: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్

image

స్టేట్ బ్యాంకు ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రామీణ మహిళలకు బ్యూటీ పార్లర్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణను భోజన వసతి సౌకర్యములతో ప్రారంభిస్తున్నట్లు SBI-RSETI డైరెక్టర్ రఘుపతి తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి 10వతరగతి పాసైన నిరుద్యోగ గ్రామీణ మహిళలు ఈనెల 25 లోపు SBI-RSETI, రాంనగర్, నల్గొండలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News March 16, 2024

భువనగిరి ఎంపీ టికెట్ కేటాయించాలి: కాసోజు శంకరమ్మ

image

ఉద్యమ ద్రోహులకు బీఆర్ఎస్ పదవులు ఇచ్చిందని తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరుల కుటుంబాలకు 10 ఏళ్లుగా న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.