India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేవరకొండ మండలంలోని ఇద్దంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ పిల్లి వెంకటయ్య యాదవ్ మరణం బాధాకరమని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. ఆయన స్వగృహంలో భౌతికకాయన్ని సందర్శించి, కంటతడి పెట్టుకున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే స్నేహితుడి వెంకటయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి నివాళులర్పించారు.
నేరేడుచర్ల అభివృద్దే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలసి పనిచేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్ల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ బి.ప్రకాష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని ఆదిశగా పనిచేయాలని సూచించారు.
ఆగస్టు15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి హాజరయ్యారు. గాంధీ విగ్రహానికి, దొడ్డి కొమరయ్య, స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు చిత్ర పటాలకు నివాళులు అర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ 5ఏళ్లలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ప్రజాప్రతినిధులుగా బాగా పనిచేశారన్నారు.
NLGలోని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని జర్నలిస్టులు ఆరోపించారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50% రాయితీ ఇవ్వాలని జర్నలిస్ట్ సంఘాలు ఇటీవల కలెక్టర్‌ను కోరగా.. ఆయన ఆదేశాల మేరకు DEO ఈనెల జూన్ 25న ప్రైవేట్ పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశించినా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని జర్నలిస్టులు మండిపడుతున్నారు.
కనగల్ మండలం బాబాసాహెబ్ గూడెం గ్రామానికి చెందిన నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లబోతు సైదిరెడ్డి(50) విద్యుత్ షాక్‌తో కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. బావి వద్ద మోటార్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురయ్యాడు. సైదిరెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతికి సంబంధించి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
డీఎస్సీని మూడు నెలలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) కోరారు. ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు. నిరుద్యోగులు సమయం కోరుతున్నారని ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
మండల పరిషత్‌లకు గురువారం, జిల్లా పరిషత్‌లకు శుక్రవారం గడువు ముగుస్తోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని 31 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించామని నల్లగొండ జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ లకు ఒకటి రెండు రోజుల్లో ప్రత్యేక పాలన అధికారిని ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. 2019లో ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలను పునర్విభజన చేశారు.
సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోవడం, పదవీ విరమణలతో RTC సిబ్బంది తగ్గుతూ వస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో RTCలో నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పనిభారం తగ్గనుందని కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో 7 డిపోల్లో సుమారు 1,818 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు.
దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ NLG సర్కిల్ పరిధిలో గత ఏడాది కాలంగా 11,706 మంది రైతులు ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల సర్వీసుల కోసం దరఖాస్తు చేశారు. అందులో 1,700 మంది రైతులు ఓఆర్సీ చెల్లించాల్సి ఉంది. మిగతా 10 వేల మంది రైతులకు వెంటనే కరెంటు కనెక్షన్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు.
జిల్లాలో గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. జడ్పీ చైర్మన్ , జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు ఆరు నెలలుగా గౌరవ వేతనాలు రావడం లేదు. బుధవారంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 742 ఎంపీటీసీలు, 71 మంది ఎంపీపీలు, 71 మంది జడ్పిటిసిలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు ఉన్నారు. ఆరు నెలలుగా వీరి వేతనాలు పెండింగ్ లోనే ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.