India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. నేడు ఆదివారం కావడంతో సాగర్ అందాల చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. మెయిన్ డ్యామ్, పవర్ హౌస్ పరిసరాల్లోకి టూరిస్టులను అనుమతించమని పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా గేట్ల వద్దకు వెళ్లే వాహనాలను దూరంలోనే పార్కింగ్ చేయిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా విషజ్వరాల బారిన పడి ప్రజలు విలవిలలాడుతున్నారు. జిల్లాలో ఇటీవల ముసురుతో కూడిన వర్షాలతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో దోమల వ్యాప్తి పెరిగింది. దీంతో జిల్లాలో ఎక్కువగా డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ ప్రబలుతున్నాయి. కీళ్లనొప్పులు, కాళ్లు, ఒంటి నొప్పుల కారణంగా వందలాది మంది రోగులు నడవలేక అల్లాడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 466 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

శాలిగౌరారం ప్రాజెక్టుకు స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రాజెక్టు నీటి సంఘం మాజీ ఛైర్మన్ చామల యాదగిరి రెడ్డి పేరు పెట్టాలని మండలానికి చెందిన పలువురు నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. శనివారం మంత్రి ఉత్తమ్‌ను HYDలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ మారం గోనారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చామల వెంకటరమణారెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు.

యువతిపై NSUI నాయకుడు దాడి చేసిన ఘటన నల్గొండలో ఆలస్యంగా వెలుగు చూసింది. NSUI నాయకుడు మనిమద్దె సాయిరాం పట్టణంలోని ఓ పాఠశాలలో ట్రైనీ టీచర్‌గా పని చేస్తున్న యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తోటి ఉపాధ్యాయులు ప్రశ్నించగా వారిని బూతులు తిట్టినట్టు సమాచారం. గతంలో ఇదే యువతి విషయంలో అతనిపై 1 టౌన్ పోలీసు స్టేషన్‌లో బైండోవర్ కేసు ఉన్నట్లు తెలుస్తోంది.

వారం రోజుల్లో వివాహం.. నిద్రలో యువకుడు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నిడమనూరు(M) ముప్పారంలో జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి వాసి శివ(25) పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈనెల 18న శివకు వివాహం నిశ్చయమైంది. శనివారం పెళ్లి బట్టలు కోసం తల్లి ఉదయాన్నే శివను లేపేందుకు ప్రయత్నించగా లేవలేదు. దీంతో వారు చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. కాగా, శివ మృతికి గల కారణాలు తెలియరాలేదు.

మిర్యాలగూడ, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని లిఫ్ట్ ఇరిగేషన్లు , నీటి పారుదల పనులపై సమీక్ష కోసం రేపు జిల్లాకు వస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

మిర్యాలగూడ మండలం నందిపాడలో మా ఊరి ప్రేమ కథ చిత్రం షూటింగ్‌ను బీజేపీ నాయకులు మదన్మోహన్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. రచయిత, దర్శకులు అంజి అయాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. శివాలయ నిర్మాణానికి వారాహి సంస్థ తరఫున ఐదు లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రవీంద్ర కుమార్, వీటి యాదవ్, భార్గవ్, గిరి, రవి శంకర్, చారి పాల్గొన్నారు.

నల్గొండలోని లతీఫ్ సాహెబ్ గుట్టపై గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి చేతికి వాచ్, ఎడమ చెవికి రింగు ఉందని వారు తెలిపారు. ఘటనా స్థలంలో చెప్పులు, బ్యాగు, పర్సు ఉన్నాయన్నారు. మృతుడిని గుర్తిస్తే నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 87126 70141కు సమాచారం ఇవ్వాలన్నారు.

తాను పెంచుకుంటున్న నాటుకోళ్లు మృతి చెందాయని ఓ మహిళ కోదాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాలిలా.. గుడిబండకు చెందిన నర్సింగోజు గీత నాటు కోళ్లను పెంచుతోంది. అడ్లూరుకు చెందిన కోటిరెడ్డి పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అతను ఎలుకల మందు పెట్టడంతో 38 కోళ్లు మృతిచెందాయని .. న్యాయం చేయాలని పోలీసులను గీత కోరింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కీసరలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన బొల్లారం కవిత భర్తతో ద్విచక్ర వాహనంపై hyd నుంచి వాసాలమర్రికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి భర్త,కొడుకు, బిడ్డకు గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.