Nalgonda

News July 2, 2024

నాగార్జున సాగర్ జలాశయం సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.00 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 121.7080 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

News July 2, 2024

NLG: కొత్త చట్టం తొలి కేసు నమోదు

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టంలో తొలి కేసు సోమవారం నల్లగొండ వన్ టౌన్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఏబీవీపీ నాయకులు స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ముందస్తు పోలీసు అనుమతి లేకుండా ధర్నా చేయడంతో నూతన చట్టం 151 ప్రకారం కేసు నమోదు చేశారు. 151 నూతన చట్టం ప్రకారం వ్యక్తిగత పూచికత్తుపై వదిలి పెట్టినప్పటికీ సెక్షన్ మార్పు మినహా వ్యక్తి గత పూచికత్తుపై వదిలేశారు.

News July 2, 2024

NLG: సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులు కిటకిట

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని పలు ఆసుపత్రులకు రోగులు తాకిడి పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి రోగాలతో ప్రజలు విలవిలాడుతున్నారు. వైద్యాధికారులు స్పందించి ప్రత్యేక హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, గ్రామీణులు కోరుతున్నారు.

News July 2, 2024

NLG: యువతిపై అత్యాచారం.. నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష

image

పోక్సో కేసులో ఓ యువకుడికి కోర్టు శిక్ష విధించింది. పోలీసులు వివరాలు.. NLGజిల్లా కట్టంగూరు మండలం కురుమర్తికి చెందిన వాసి వంశీకృష్ణ(19) HYDలో ఉంటూ మెకానిక్‌గా పనిచేసేవాడు. లవ్ చేస్తున్నానంటూ ఇంటర్ చదివే ఓ యువతి(17) వెంట పడేవాడు. 2017 DEC 10న ఆమెను అపహరించి, 2రోజులు రూమ్‌లో బంధించి అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడి తుది శ్వాస వరకు జైలు శిక్ష విధిస్తూ సోమవారం RRజిల్లా స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది.

News July 2, 2024

NLG: కొత్త చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ

image

భారత ప్రభుత్వం నూతన న్యాయ చట్టాలు 2023 సోమవారం నుంచి అమలులోకి వచ్చాయని ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని ప్రజలకు మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

News July 2, 2024

NLG: ఆమెకు పుట్టిన రోజే చివరి రోజైంది

image

తల్లిగారింట్లో పుట్టిన‌రోజు చేసుకోవాలని వచ్చిన వివాహిత అదేరోజు కరెంట్ షాక్‌తో మృతిచెందిన ఘటన యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లిలో జరిగింది. స్థానికుల సమాచారం.. రాజపేట మండలం పారుపల్లి వాసి భూపతి సురేశ్, బాలాంజలి దంపతులు. సోమవారం బర్త్ డే సందర్భంగా పిల్లలు, భర్తతో కలిసి గౌరాయిపల్లికి వచ్చింది. బట్టలు ఉతుకుతుండగా కరెంట్ షాక్‌కు గురైంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News July 2, 2024

NLG: ముగిసిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. మొత్తం 150 మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెడ్ మాస్టర్‌గా ప్రమోషన్ పొందారు. 345 మంది స్కూల్ అసిస్టెంట్లు వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. 450 మంది SGTలు స్కూల్ అసిస్టెంట్లుగా, LFL HMలుగా ప్రమోషన్ పొందారు. చివరి రోజు 1520 మంది SGTలు ఇతర పాఠశాలలకు బదిలీ అయ్యారు. కాగా నేడు వారంతా విధుల్లో చేరనున్నారు.

News July 2, 2024

ప్రజావాణి ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్

image

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన NKPలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫిర్యాదులను పరిష్కరించాలని చెప్పారు.

News July 1, 2024

భువనగిరి కలెక్టరేట్లో ప్రజావాణి

image

భువనగిరి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతు హాజరై అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా దరఖాస్తులను అధికారులకు అందజేస్తున్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ గంగాధర్ ఏవో జగన్ మోహన్ గౌడ్ జెడ్పి సీఈఓ శోభారాణి అధికారులు పాల్గొన్నారు.

News July 1, 2024

NLG: జిల్లాలో పెరుగుతున్న డెంగీ కేసులు

image

నల్గొండ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. వర్షాకాలం షురూ ఆరంభంలోనే డెంగీ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కావడం డెంగీ వ్యాప్తి ఉద్ధృతికి అద్దం పడుతోంది. నల్గొండ నియోజకవర్గంలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.