India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నాగార్జునసాగర్ నీటితో జిల్లాలోని అన్ని చెరువులు నింపనున్న దృష్ట్యా రైతులెవరు సాగునీటిని మళ్ళించుకోకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. శనివారం ఆయన నాగార్జునసాగర్ నీటి వినియోగంపై రెవెన్యూ, పోలీస్,ఇరిగేషన్, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా రాష్ట్ర మంత్రులు శుక్రవారం సాగునీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ విధంగా ఉంది.
ఇన్ ఫ్లో :4,17,147క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 35,953 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం: 561.50అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 235.9395టీఎంసీలు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో గుర్తుతెలియని మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడు హైదరాబాద్‌లోని వారసిగూడకు చెందిన సాయి కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నకిరేకల్ మండలం నోములకి
చెందిన వెల్మకంటి అనిత(28) అనే వివాహిత, ప్రియుడి వేధింపులు తాళలేక ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టేకుల రాజేశ్‌తో అనితకు కొంతకాలం క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. తనతోనే ఉండాలన్న రాజేశ్ వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆహారభద్రతా కార్డుల్లో రెండో బిడ్డ వివరాలను చేర్పించే అవకాశం లేకుండా పోయింది. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా వీలు లేదు. దీంతో వేలాది మంది బాధితులు వారి బిడ్డల వివరాలు కార్డుల్లో లేకపోవడంతో మదనపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 10.07 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 29.84 లక్షల మంది సభ్యులు (యూనిట్లు) ఉన్నారు. సుమారు 50 వేల మందికి పైగా మీ-సేవా కేంద్రాల్లో ఆరేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేసిన ఐటీ హబ్‌ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు, ఇంజనీరింగ్ పట్టభద్రులకు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉపాధినిచ్చే దిశగా గత ప్రభుత్వం సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఐటి హబ్లు ఏర్పాటు చేసింది. ప్రారంభంలో అట్టహాసంగా ముందుకొచ్చిన పలు కంపెనీలు ఏడాది గడవకముందే.. సదరు కంపెనీలు లేకపోవడంతో హబ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారాయి.

సూర్యాపేట మండలంలో జాటోత్ తండాలో తెల్లవారుజామున దారుణం జరిగింది. తండాకు చెందిన దరావత్ రమణను దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

పురుగు మందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన గిరిబాబు (22)కు తిరుమలగిరి మండలం అనంతారం గ్రామానికి చెందిన యువతితో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది గిరిబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదైంది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జునసాగర్‌లోకి రోజూ 30 టీఎంసీలకు పైగా నీరు చేరుతోంది. సాగర్ నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 312.05 టీఎంసీలకు గాను శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 211.10 టీఎంసీలకు చేరింది. ఇప్పటికే వరద నీరు ప్రాజెక్టు గేట్లను తాకింది. 2,3 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటోందని అధికారులు భావిస్తున్నారు.

ఈనెల 5 నుండి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన NLG నుండి మండల స్థాయి అధికారులతో స్వచ్ఛదనం పచ్చదనం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత, మొక్కలు నాటడం, తాగునీరు, వివిధ సంస్థల పరిశుభ్రత, వీధికుక్కల బెడద తగ్గించడం వంటి అంశాలను చేపట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.