India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో నల్గొండ జిల్లాలో 3,994 మంది హాజరవగా2,286 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 57.24గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 2,364 మంది పరీక్ష రాయగా 1,448 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.25గా ఉంది. యాదాద్రి జిల్లాలో 1,835మందికి 1043 (56.84) మంది పాసయ్యారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో నల్గొండ జిల్లాలో 3,994 మంది హాజరవగా2,286 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 57.24గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 2,364 మంది పరీక్ష రాయగా 1,448 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.25గా ఉంది. యాదాద్రి జిల్లాలో 1,835మందికి 1043 (56.84) మంది పాసయ్యారు.
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ లో నల్గొండ జిల్లాలో 7,459 మంది హాజరవగా 4,962 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 66.52గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 4,565 మంది పరీక్ష రాయగా 2,712 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 59.41గా ఉంది. యాదాద్రి జిల్లాలో 3,007మందికి 1969 (65.48%) మంది పాసయ్యారు.
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి 30 నిమిషాల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నేడు సోమవారం కావడంతో భక్తులు కొండపై సాధారణంగా కనిపించారు. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై 65పై దారిదోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఖమ్మంకి చెందిన ఉపేందర్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా కారులో చోరీ జరిగింది. దాబా వద్ద నిద్రించగా గుర్తుతెలియని వ్యక్తుల కారులోంచి రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందంతో పోలీసులు గాలిస్తున్నారు.
పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు 2.80 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని ఓ అంచనా. పెండింగ్ బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో వారు ఆర్థికంగా సతమతమవుతున్నారు. పశు పోషణ రోజురోజుకూ తలకు మించిన భారంగా మారుతోందని వాపోతున్నారు. 53 రోజులుగా పాల బిల్లులు విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
జిల్లాలో వానాకాలం సాగు పనులు మందకొడిగా సాగుతున్నాయి. సీజన్ ఆరంభమై మృగశిర కార్తెలో పోయి ఆరుద్ర కార్తె వచ్చినప్పటికీ సాగు పనులు ఊపందుకోలేదు. సరైన వర్షాలు కురవకపోవడంతో జిల్లా వ్యాప్తంగా సాగు పనులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ప్రస్తుత వానాకాలంలో మొత్తం 11.40లక్షల ఎకరాల్లో పత్తి, వరి, వేరుశనగ, కంది, పెసర, ఇతర పంటలను రైతులు సాగు చేయనున్నట్టు జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
నల్గొండ NG కాలేజీ స్టూడెంట్స్ సత్తాచాటుతున్నారు . డిగ్రీ స్థాయిలోనే అగ్నిపథ్‌కు ఎంపికై నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసే అవకాశాన్ని పొందుతున్నారు. ఎన్సీసీ విద్యార్థులు ఉమేష్, చరణ్, మహేష్, కార్తీక్, కళ్యాణ్ లాజర్, ఎం.మహేష్ గతేడాది OCTలో అగ్నిపథ్‌కు ఎంపికయ్యారు. ఏడు నెలల పాటు తమిళనాడులో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల వీరు జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీలో సైనికులుగా బాధ్యతలు స్వీకరించారు.
కలెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా పరిపాలనలో సరికొత్త మార్పునకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇకపై ప్రతీ సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీనిని నిర్వహించేలా ఇప్పటికే ఆర్డర్స్ పాసయ్యాయి. ఏ సమస్య అయినా 15రోజుల్లో పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అన్నదాతలతో దోబూచులాడుతున్నాయి. తొలకరి జల్లులతో పులకరించాల్సిన పుడమితల్లి నోళ్లు తెరిచింది. సకాలంలో వర్షాలు కురిస్తే ఈ సమయంలో జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉండేవి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు మెట్ట, మాగాణిభూముల్లో దుక్కులు దున్ని పంటల సాగుకు అనుకూలంగా సిద్ధం చేశారు. అదునులోవర్షాలు పడకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదని రైతులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.