India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాను అధికారంలో ఉన్నా లేకున్నా చచ్చేంత వరకు ప్రజల్లోనే ఉండి ప్రజాసేవకే తన జీవితం అంకితం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చిట్యాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లతో సమానమన్నారు. తన రాజకీయ ప్రస్థానం చిట్యాల నుంచే ప్రారంభమైందని, చిట్యాలకు తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు.
ఫణిగిరి బౌద్ధ శిల్పాలు, జాతక కథలు తెలిపే తోరణాలను గత ఏడాది జులైలో అంతర్జాతీయ ప్రదర్శన నిమిత్తం USలోని న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియానికి, దక్షిణకొరియా సియోల్‌కి తీసుకెళ్లారు. ప్రదర్శన ముగిసిన అనంతరం శనివారం వీటిని తిరిగి ఫణిగిరి మ్యూజియంలో భద్రపర్చినట్లు ఆర్కియాలజీ AD మల్లునాయక్ తెలిపారు. ప్రపంచంలోని పురవస్తు శాఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఫణిగిరి బౌద్ధ శిల్పాలను సందర్శించారని పేర్కొన్నారు.
చిట్యాలలో హైవే ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆదివారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద భూమి పూజ కార్యక్రమం జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమానికి రానున్నారు.
లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండలో వరకట్నం వేధింపులతో వివాహిత పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. SRPT జిల్లా నడిగూడెం మం. బృందావనపురం గ్రామానికి మానసతో కారుకొండకి చెందిన సంతోశ్‌కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్ని రోజుల నుంచి అదనపు కట్నం కోసం భర్త మానసను వేధిస్తున్నాడు. దీంతో పురుగుల మందు తాగిన మానస సృహ కోల్పోయింది. KMM తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
వానకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయ సీజన్ మొదలైంది. నల్గొండ జిల్లాలో చాలా వరకు రైతులు ప్రధానంగా పత్తిని పండిస్తారు. విత్తనాలను విత్తడం, వరుసలు వేయడం, పంటలో కలుపు తీయడానికి గుంటుక కొట్టడం తదితర పనులను ఎద్దుల అవసరం ఉంటుంది. ఎద్దులు ఉన్న రైతులు వాటిని కిరాయికి ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. మనిషితో అయితే రూ.2వేలు, మనిషి లేకుండా కేవలం ఎద్దులే అయితే రూ.1500 వరకు అద్దె చెల్లిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నల్గొండ జిల్లాకు రానున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శనివారం జరిగిన జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తారని చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టులు, అభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారని తెలిపారు.
నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలోని మున్సిపల్ పార్కులో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మూడు గంటల పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి కొన్నింటిని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.
ధరణి సమస్యల పరిష్కారానికి మోక్షం లభించనుంది. ఎన్నికల కోడ్ ముగియడం, జిల్లాలకు కొత్త కలెక్టర్లు రావడంతో పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 16,733 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. సూర్యాపేటలో 7,293, యాదాద్రిలో 8,342 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వచ్చే నెలాఖరులోగా అన్ని అర్జీలు పరిష్కారం అయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
ఇచ్చిన మాటకు కట్టుబడి జులైలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు భరోసాపై ఇప్పటికే సీఎం ఆధ్వర్యంలో మంత్రులతో కమిటీ వేశామన్నారు.
తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లంలలో మిషన్ భగీరథ నీరు రావటం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఇంటింటికీ తాగు నీరు అంటూ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నీరందడానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.