Nalgonda

News July 26, 2024

జీరో బిల్‌తో ప్రభుత్వానికి రూ.350 కోట్ల భారం

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల విద్యుత్‌ వినియోగాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పథకానికి 8.50 లక్షల దరఖాస్తులు రాగా.. ఐదు లక్షల కనెక్షన్ల వరకు ప్రస్తుతం అధికారులు జీరో బిల్‌ నమోదు చేస్తున్నారు. సాంకేతిక, ఇతర కారణాలతో కొంత మందికి అర్హత ఉన్నా ఈ పథకంలో లబ్ధి చేకూరడం లేదు. ఉమ్మడి జిల్లాలో జీరో బిల్‌ నమోదు చేయడం వల్ల రూ.350 కోట్ల మేర ఆర్థిక భారం పడుతోంది.

News July 26, 2024

ఉమ్మడి జిల్లాలో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల

image

ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏడాదికి 42 వేల ఇళ్లను నిర్మించనున్నారు. మరోవైపు పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని, అసంపూర్తిగా ఉన్నవాటిని పూర్తి చేస్తామని గురువారం శాసనసభలో బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో రెండు పడకగదుల ఇళ్లు 16,254 మంజూరుకాగా.. అందులో 6,391 పూర్తయ్యాయి.

News July 26, 2024

NLG: ముసురుతో ముప్పే..! పంటలకు నష్టం

image

ఎప్పుడెప్పుడా అని నింగి వైపు చూసిన రైతన్నకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఏకధాటిగా కురుస్తున్న ముసురు వానతో వివిధ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. అల్పపీడన ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న ముసురు వాన వల్ల పంటల్లో తేమ శాతం అధికమవుతోంది. చేన్లలో నీరు నిల్వ ఉండటంతో.. చేలు జాలువారి పంటను దెబ్బతీసే ప్రమాదముంది.

News July 26, 2024

ప్రభుత్వ నిర్ణయంతో 4 లక్షల ఎకరాలకు బోనస్

image

33 రకాల సన్నరకాల వంగడాలకు క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మిర్యాలగూడ, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, కోదాడ, చిలుకూరు ప్రాంతాల్లో లక్షల మంది రైతులు ఏటా సాగర్‌ ఎడమ కాల్వ కింద సన్నరకాలనే సాగు చేస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో సుమారు 4 లక్షల ఎకరాల్లో పండే సన్నరకాలకు బోనస్‌ రానుంది.

News July 26, 2024

గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు

image

ప్రతి గ్రామపంచాయతీలో 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా మార్చి ఆరేళ్లు గడిచినా కనీస వసతులు లేవు. మరోవైపు పంచాయతీలకు పక్కా భవనాలు లేకపోవడంతో అద్దె గదుల్లోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. వీటన్నింటికీ ఈ ఏడాదిలో పక్కా నిర్మాణాలను నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం గురువారం బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

News July 26, 2024

ప్రాజెక్టులకు బడ్జెట్లో భారీగా పెరిగిన కేటాయింపులు

image

పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. ప్రాజెక్టులకు బడ్జెట్లో ఈసారి కేటాయింపులు భారీగా పెరిగాయి. అయినా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పనులకు అవి సరిపోని పరిస్థితి నెలకొంది. నల్గొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు మొత్తంగా రూ. 8598 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.1699.90 కోట్లు కేటాయించింది.

News July 26, 2024

నాగార్జునసాగర్ ఎత్తిపోతల పథకానికి రూ.500 కోట్లు

image

నాగార్జునసాగర్ పరిధిలోని ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది. దేవరకొండతో పాటు సాగర్ ఎడమ కాలవ పరిధిలోని నాగార్జునసాగర్, మిర్యాలగూడ, HNR నియోజకవర్గాలలో సుమారు రూ.3 వేల కోట్లతో గతంలో KCR ఎత్తిపోతల నిర్మాణం ప్రారంభించారు. కానీ నిధులు కేటాయించకపోవడంతో పునాది దశలోనే ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం ముందుకు సాగనుంది.

News July 26, 2024

నల్గొండ: అస్సాంలో ఆర్మీ జవాన్ మృతి

image

బార్డర్‌‌లో నల్గొండ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్‌ అసువులు బాశారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. అనుముల మం. మదారిగూడెనికి చెందిన ఈరేటి మహేశ్ (24). సూర్యాపేట ఆర్మీ రిక్రూట్‌మెంట్‌-2022లో సైన్యంలో చేరారు. అస్సాంలోని మంచుకొండల్లో గస్తీ కాస్తుండగా వాతావరణ పరిస్థితుల అనుకూలించక అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ అక్కడే‌ చనిపోయారు. నేడు భౌతికకాయం స్వగ్రామానికి చేరనుంది.

News July 26, 2024

సాగర్‌కు వరద పెరుగుతోంది

image

ఉమ్మడి నల్గొండ రైతులకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కీలకం. పంటల సాగు ఎక్కువగా సాగర్ ఆయకట్టు పరిధిలోనే జరుగుతోంది. కొన్ని రోజులుగా సాగర్ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఎగువన కురుస్తోన్న వర్షాలతో శ్రీశైలం డ్యామ్‌కు వరద పోటేత్తుతుండగా దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు 31,784 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

News July 26, 2024

నేడు నల్లగొండలో మినీ జాబ్ మేళా

image

NLG జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు పలు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించుటకు నేడు ఉదయం 10-30 గంటలకు జిల్లా ఉపాధికల్పన కార్యాలయము, ఐటిఐ క్యాంపస్ నల్లగొండలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి S.మాధవరెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాకు 4 ప్రైవేట్ కంపెనీలు హాజరవుతున్నాయని, ఎంపిక కాబడిన వారు NLG, HYD పరిసర ప్రాంతాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు.