India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని సామాన్య రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి మంగళవారం విడుదలైన ‘నీట్’ ఫలితాల్లో సత్తా చాటింది. రాజపేట మండలం బేగంపేటకు చెందిన ఒగ్గు కర్ణాకర్-అనితల కుమార్తె కీర్తిసాయి నీట్‌లో 554 మార్కులు సాధించింది. ఇటీవల విడుదలైన ఈఏపీ సెట్‌లోనూ ఆమె 2,046 ర్యాంక్‌తో మెరిసింది. పట్టుదలతో చదివి తమ గ్రామ ‘కీర్తి’ పెంచిందంటూ స్థానికులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఎలిమినేషన్ రౌండ్స్‌లో కాంగ్రెస్‌కు 220 ఓట్లు రాగా, BRSకు 139 ఓట్లు, BJPకి 118 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రెండు రోజులుగా కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. KMM-NLG-WGL ఉపఎన్నిక కౌంటింగ్‌లో ఎవరికి గెలుపునకు సరిపడా ఓట్లు రాలేదు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు రావాల్సి ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,22,813 ఓట్లు, BRS అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,246 ఓట్లు, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 3,36,013 పోలవగా అందులో చెల్లని ఓట్లు 25,854 ఉండటం విశేషం. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీపడగా చెల్లని ఓట్ల సంఖ్య 5వ స్థానంలో నిలిచింది. డిగ్రీలు చదివిన ఓటర్లు ఇలా ఓటును దుర్వినియోగం చేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.
గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు నల్గొండ జిల్లాలో మొత్తం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ రాములునాయక్ తెలిపారు. ఈనెల 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు జిల్లా పోలీసు కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పరీక్షకు జిల్లా నుండి 16,899 మంది హాజరవుతారన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లే కొంపముంచుతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. కొద్దిసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో ప్రాధాన్యత ఓట్లతో కచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై ARO కె. వెంకటేశ్వర్లు తిప్పర్తి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా దుప్పలపల్లి గోడౌన్‌లో విధులు నిర్వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బ్యాలెట్ పేపర్ చూపించాలని బెదిరించారన్నారు. తన విధులకు ఆటంకం కలిగించినందుకు మాజీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ ఎన్నికల కౌంటింగ్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తాము గెలుస్తామని, తమ గెలుపును ఆపాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. పారదర్శకంగా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించాలన్నారు. గెలుపు, ఓటములను స్వీకరిస్తామని అన్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్లతో గెలుస్తామని నమ్మకముందన్నారు.
నల్గొండలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మూడు రౌండ్లు ముగిసేసరికి 2,64,216 మొదటి ప్రాధాన్యత చెల్లిన ఓట్లు నమోదయాయి. తీన్మార్ మల్లన్న 1,06,234, రాకేశ్ రెడ్డి 87,356, ప్రేమేందర్ రెడ్డి 34,516, ఆశోక్ పాలకూరి 27,493లకు ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల లీడ్‌లో ఉన్నారు.
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో చెల్లని ఓట్లు అభ్యర్థుల అంచనాలు తారుమారు చేస్తున్నాయి. మూడురౌండ్లు ముగిసేసరికి 20 వేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. చెల్లని ఓట్ల బ్యాలెట్ పేపర్‌లో జై మల్లన్న, జై రాకేష్ రెడ్డి అంటూ రాశారు. మరికొందరు అభ్యర్థిని ప్రశంసిస్తూ ఆప్షన్ అంకె వేయకుండా ఐలవ్యూ అని రాశారు.
Sorry, no posts matched your criteria.