Nalgonda

News May 10, 2024

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లలో 6 తిరస్కరణ

image

నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి ఈరోజు నామినేషన్లను పరిశీలించారు. ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. మొత్తం 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. వీరిలో ఆరు నామినేషన్లు తిరస్కరించామన్నారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని తెలిపారు.

News May 10, 2024

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన హామీ

image

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ జిల్లా వాసులకు సంచలన హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాబోయే 3 సంవత్సరాలలో SLBC సొరంగం పనులు పూర్తి చేస్తానని నల్గొండ ప్రజలకు హామీ ఇచ్చారు. నల్లొండలో ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకుంటానని తెలిపారు. మీరు ఇచ్చిన విజయాలకు సార్థకత చేకూర్చేందుకు ప్రతి నిమిషం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు.

News May 10, 2024

మరికాసేపట్లో నకిరేకల్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నకిరేకల్‌‌లోని ఎర్పాటు చేసిన జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో చేరుకోనున్నారు. జనజాతర సభకు ఇప్పటికే కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. ఈ సభలో ఏఐసీసీ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

News May 10, 2024

చెప్పులు కుట్టిన ఎమ్మెల్యే కుంభం

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వలిగొండలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పులు కుడతూ ఓట్లగిగారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ ప్రచారంలో పాశం సత్తి రెడ్డి, ఉపేందర్, బోస్ పాల్గొన్నారు.

News May 10, 2024

బాలికపై అత్యాచారం.. పొక్సో కేసు నమోదు

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాలు.. సూర్యాపేట(D) కోదాడ సమీపంలోని రామచంద్రాపురానికి చెందిన బాలుడు యూసుఫ్‌గూడలో చదువుకుంటున్నాడు. అతడికి సమీప ప్రాంతంలో నివసించే పదో తరగతి బాలిక పరిచయమైంది. మార్చి 26న బాలిక ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిపై పొక్సో కేసు నమోదైంది.

News May 10, 2024

భువనగిరి కోటపై ఎర్రజెండా ఎగరేస్తారా..?

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకప్పుడు కామ్రేడ్లదే హవా. ఏ ఎన్నికైనా గెలిచి తీరాల్సిందే. 1952లో ఎంపీ సెగ్మెంట్‌లో నల్గొండ నుంచి అధిక మెజార్టీ, 1957, 1962లో వామపక్షాలే గెలిచాయి. మళ్లీ 1991, 96,98, 2004లో కామ్రెడ్లదే విజయం. అంతటి ఘన చరిత్ర కలిగిన కామ్రెడ్లు కొంతకాలంగా మద్దుతుకే పరిమితమయ్యారు. ఈసారి భువనగిరిలో సీపీఎం ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తుండగా ఏమేరకు ఓట్లు సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.

News May 10, 2024

ఎన్నికల సిబ్బంది తరలింపునకు ఆర్టీసీ బస్సులు సిద్ధం

image

ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల సామాగ్రి, సిబ్బందిని తరలించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 320 బస్సులు సిద్ధం చేసినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్గొండ డిపో నుండి 49, దేవరకొండ 83 ,మిర్యాలగూడ 29, కోదాడ 41 ,సూర్యాపేట 72 యాదగిరిగుట్ట 46 బస్సులు సిద్ధం చేసినట్లు తెలిపారు.

News May 10, 2024

REWIND..నల్గొండ నుంచి గెలిచి పార్లమెంట్ ఓపెన్..

image

1952లో నల్గొండ నుంచి ఎంపీ అభ్యర్థిగా రావి నారాయణ రెడ్డికి 3,09,162 ఓట్లు పోలవ్వగా, సమీప ప్రత్యర్థి పీ.భాస్కర్ రావు మీద 2,22,280 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలి లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు పొందిన ఎంపీతో పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలని అప్పట్లో నిర్ణయించారు. దీంతో నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ సాధించిన నారాయణ రెడ్డి పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభించి తొలి అడుగు వేశారు. #MP Elections

News May 10, 2024

రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారి!

image

NLG లోక్ సభ నియోజకవర్గం, KMM-NLG-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఇలా రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం చాలా అరుదు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటి ఫికేషన్ విడుదల కాగా.. ఎన్నికల సంఘం NLG లోక్ సభ నియోజకవర్గానికి జిల్లా కలెక్టర్ హరిచందన ను రిటర్నింగ్ అధికారిగా నియమించారు.

News May 10, 2024

NLG: SMSలపై నిషేధం

image

ఈ నెల 13న MP ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా రేపు సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు అభ్యంతరకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ SMSలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని గుర్తు చేశారు.SHARE IT