Nalgonda

News May 10, 2024

12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు నల్లగొండలో శిక్షణ

image

WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో పిఓ, ఏపీఓలు, పోలింగ్ సిబ్బందిది ముఖ్యపాత్ర అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

News May 9, 2024

12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు నల్లగొండలో శిక్షణ

image

WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలను సక్రమంగా నిర్వహించడంలో పిఓ, ఏపీఓలు, పోలింగ్ సిబ్బందిది ముఖ్యపాత్ర అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో WGL- KMM- NLG శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి 12 జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

News May 9, 2024

ధాన్యం అమ్మిన రైతులకు రూ.584 కోట్లు చెల్లింపు

image

NLG జిల్లాలో ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటివరకు రూ.584 కోట్లు చెల్లించినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తెలిపారు. కష్టం మిల్లింగ్ రైస్, యాసంగి ధాన్యం కొనుగోలుపై గురువారం తన ఛాంబర్ లో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు గాను 370 దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, వీటి ద్వారా ఇప్పటి వరకు 661 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు.

News May 9, 2024

కార్యాలయాలకు సెలవు: జిల్లా కలెక్టర్ హరి చందన

image

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజు 13న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న విద్యా సంస్థలు, కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల నిమిత్తం ఈ నెల 12వ తేదీ సైతం సెలవుదినంగా ప్రకటించారు.

News May 9, 2024

పగడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు : ఎస్పీ

image

జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల సమయం సమీపిస్తున్నoదున రానున్న 72 గంటలు ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే గురువారం తెలిపారు. ఈనెల11వ తేదీ నుండి ఎన్నికల రోజైన 13వ తేది వరకు ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా 48 గంటల నిబంధనలు పటిష్టంగా ఉంటాయన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని… సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు.

News May 9, 2024

నల్గొండ జిల్లాలో జీరో షాడో

image

నల్గొండ జిల్లా ఆమగల్లులో జీరో షాడో కనిపించింది. అంటే మిట్టమధ్యాహ్నం రోజూ కనిపించే మన నీడ ఇవాళ కనిపించదు. నిటారుగా ఉండే మనిషి, వస్తువు లేదా జంతువుల నీడలు కనిపించవు. ఇది ఇవాళ మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై 2, 3 నిమిషాల పాటు కొనసాగుతుంది.

News May 9, 2024

నల్గొండ: రిక్షా తొక్కుతూ వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ 

image

శివసేన బలపరిచిన నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి పూస శ్రీనివాస్ రిక్షా తొక్కుతూ వచ్చి నామినేషన్ వేశారు. ఆయన అర్ధనగ్నంగా నామినేషన్ కేంద్రానికి వచ్చి నామినేషన్ పత్రాలను కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. నిరుద్యోగుల గొంతుకనై పోరాడతానని శ్రీనివాస్ చెప్పారు. 

News May 9, 2024

NLG: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు

image

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుండగా ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. బుధవారం మరో 12 మంది అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందనకు నామినేషన్లు అందజేశారు. దీంతో నామినేషన్లు వేసిన వారి సంఖ్య 41కి చేరింది.

News May 9, 2024

నల్గొండ జిల్లాలో హత్య

image

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామంలో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న ఆంబోతు శుక్ర నాయక్(40 )ను గుర్తుతెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. మృతదేహాన్ని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 9, 2024

భువనగిరి: 2 రోజులు మద్యం దుకాణాలు బంద్

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు లేదా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవన్నారు. ఎక్సైజ్ శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.