India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు దగ్గర పడుతోంది. జనంలోకి వెళ్లేందుకు అభ్యర్థులకు వారం రోజులే మిగిలి ఉంది. దీంతో పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. పోలింగ్ కు 48 గంటల ముందే ప్రచారం ముగియనున్నందున ఈ లోపు ఎక్కడెక్కడ అయితే ముఖ్యమైన సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
ఇంటర్ ఫలితాల్లో తప్పడంతో విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన హుజూర్‌నగర్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. విద్యార్థి (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 29న ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి, మెరుగైన వైద్యం ఖమ్మం.. అక్కడి హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
భువనగిరి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నాంపల్లిలో శనివారం రాత్రి భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలతో కలిసి జనగర్జన ర్యాలీ నిర్వహించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మాజీ సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.
జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా సోషల్ మీడియాలో పెట్టే వివిధ పోస్ట్‌లపైన నిరంతరం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఎవరైన సామాజిక మాధ్యమాల్లో వాట్స్ అప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్‌లో రాజకీయ పార్టీలపై, వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పన్నారు.
సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియ రాలేదని సిఐ రాజశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భువనగిరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసుల వివరాలిలా.. పట్టణ పరిధిలోని సంజీవ్ నగర్ సమీపాన 60 సంవత్సరాల వయసుగల ఓ వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానికుల సహాయంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తిగా భావిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తనకు బలం బలగమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అన్ని నియోజకవర్గాల కంటే మునుగోడులో మోజార్టీ రావాలని ఆయన కార్యకర్తలను అభ్యర్ధించారు. ప్రతి కార్యకర్త ప్రతి రోజు గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మూడో రోజు ఇప్పటివరకు 9 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. తొలిరోజు ముగ్గురు, రెండోరోజు నలుగురు అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ఇవాళ ఇప్పటి వరకు ఇద్దరు నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా కర్నే రవి నామినేషన్ దాఖలు చేశారు.
గ్రామపంచాయతీ ఉద్యోగి వడదెబ్బతో మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. భువనగిరి మండలం జమ్మాపురానికి చెందిన మాదాను కస్పరాజు శనివారం గ్రామంలో నీరు సరఫరా చేస్తుండగా వడదెబ్బతో స్పృహ తప్పి పడిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
NLG -WGL-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BJP తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.