India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండడంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. గత ఎన్నికల్లో రాజధాని ఓటర్లు నల్గొండలో (INC), భువనగిరి(INC)ని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఇక సాయంత్రం 6.30 తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఎవరివైపు అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం కేతపల్లిలో రికార్డు స్థాయిలో 46.8° ఉష్ణోగ్రత నమోదైంది. దామరచర్లలో 46.3° ఉష్ణోగ్రత నేరేడుగోమ్ము, కామారెడ్డిగూడెం, నకిరేకల్ , నాంపల్లి, నిడమానూరు, హాలియా, కట్టంగూరులో 45 డిగ్రీలు అత్యల్పంగా చింతపల్లి మండలంలో 40.1° ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ ప్రధాన పట్టణాల్లో ఎండ తీవ్రతకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని NLG జిల్లా స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర ఆదేశించారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ విషయమై నల్లగొండలో శుక్రవారం ఆయన నిర్వహించిన కో- ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. 16,899 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
నల్గొండ జిల్లాలో ఈ వానాకాలం పంటకు సంబంధించి విత్తన నిలువలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాలలో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి కొరత లేదన్నారు. జిల్లాలో లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే ప్యాకేజీలో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గవర్నమెంట్ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి బడి బాట కార్యక్రమం చేపట్టనుంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులే లక్ష్యంగా ఈ ప్రోగ్రాం ఉండనుంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 2,457 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2022-23లో ఒక్క విద్యార్థి లేని సూల్స్ 109 ఉన్నాయని, ఇది ఆందోళనకరమని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ముఖ్యమని విద్యా వేత్తలు చెబుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పురపాలికలో అవకతవకలు జరగకుండా రాష్ట్ర పురపాలక శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆస్తి పన్ను వసూలు విధానంలో మార్పు చేసింది. ఇకనుంచి పట్టణాల్లో రెగ్యులర్ సిబ్బందికే పన్ను వసూలు బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేపట్టింది. మున్సిపాలిటీలో పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఔట్సోర్సింగ్ ను నగదు లావాదేవీల నుంచి తప్పించేలా ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీచేసింది.
ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన వనం రేవతికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మణ్ చౌటుప్పల్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ఫెయిల్ అవ్వడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. ఈ నేపథ్యంలో సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
నల్గొండ బైపాస్‌ను 14 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేన్లుగా నిర్మించేందుకు జాతీయ రహదారుల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి కోమటిరెడ్డి కేంద్రంతో, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు ఆచరణ రూపం దాల్చనున్నాయి. నార్కట్ పల్లి- అద్దంకి జాతీయ రహదారికి, మాచర్లకు వెళ్లే హైవేను అనుసంధానిస్తూ నిర్మించే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కోడ్ ముగియగానే టెండర్లు పిలవనున్నారు.
NLG జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా శుక్రవారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. జిల్లాలోని 435880 మంది ఆహార భద్రత కార్డుదారులకు జూన్ 2024 మాసానికి సంబంధించి 5949.848 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రతి లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని డిఎస్ఓ తెలిపారు.
మంత్రాల నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన జెవాజి సాయిలు( 80)ను అదే గ్రామానికి చెందిన జెవాజి శ్యామ్(32) మంత్రాల నెపంతో గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. శవాన్ని గడ్డివాములో దాచినట్లు పోలీసులకు తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని వెలికి తీశారు.
Sorry, no posts matched your criteria.