Nalgonda

News May 6, 2024

నల్గొండ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

గుర్రంపోడు మండలం మోసంగికి చెందిన నడ్డి శ్రీను (40) గ్రామ శివారులోని ముత్యాలమ్మ గుడి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News May 6, 2024

NLG: డిగ్రీ ప్రవేశాలకు నేటి నుంచి దోస్త్

image

ఉమ్మడి జిల్లాలోని 75 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ విధానంలో నేటి నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. మూడు దశల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇవి పూర్తయిన తర్వాత జూలై 7 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. దరఖాస్తులు, వెబ్ ఆప్షన్స్, సీట్ల కేటాయింపు ఆన్లైన్లోనే ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అన్ని డిగ్రీ కళాశాలలో కలిపి 26,040 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

News May 6, 2024

NLG: 17 సార్లు ఎన్నికలు.. మహిళలకు దక్కని అవకాశం!

image

ఎన్నికల్లో పోటీ చేసే మహిళల సంఖ్య తగ్గిపోతుంది. లోక్ సభ స్థానానికి ప్రధాన పార్టీల తరఫున మహిళా అభ్యర్థులే లేరు. ఓటర్ల పరంగా దాదాపు 51 శాతం ఉన్న మహిళలు పోటీపరంగా మాత్రం ప్రాధాన్యం తగ్గడం గమనార్హం. NLG స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగినా.. ప్రధాన పార్టీలు వారిని పోటీకి దింపలేదు. ప్రస్తుత ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ నుంచి ఒకే ఒక మహిళ పోటీ చేస్తున్నారు.

News May 6, 2024

నల్గొండ: వడదెబ్బతో ఇద్దరు మృతి

image

శాలిగౌరారం మండలంలో వడదెబ్బకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన ఆలస్యంగా తెలిసింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్లూరుకి చెందిన రావుల యాదమ్మ (65), గురజాల గ్రామానికి చెందిన సుల్తాన్ యల్లయ్య(60) శనివారం ఉపాధి పనులకు వెళ్లారు. రాత్రి ఇంటి వద్ద అస్వస్థతకు గురికావడంతో వైద్యం కోసం తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News May 6, 2024

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు: SP

image

NLG: ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రశాంత వాతావరణం కల్పించి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.ఇప్పటికీ వివిధ కేసులలో ఉన్న పాత నేరస్తులను, రౌడీషీటర్స్ ను 512 కేసులలో 943 మందిని బైండోవర్ చేయడం జరిగిందని వెల్లడించారు.జిల్లావ్యాప్తంగా లైసెన్స్ కలిగిన వ్యక్తుల నుంచి 116 ఆయుధాలను డిపాజిట్ చేయడం జరిగిందని తెలిపారు

News May 5, 2024

జిల్లా వ్యాప్తంగా రూ.14.42 కోట్ల నగదు, మద్యం, ఆభరణాలు సీజ్

image

NLG: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా రూ.14.46 కోట్ల నగదు మద్యం ఆభరణాలు ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు ఎస్పి చందనా దీప్తి వెల్లడించారు.ఓటర్లను ప్రభావితం చేసే నగదు,మద్యం ఇతర వస్తువుల అక్రమ రవాణాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 5, 2024

NLG: పోస్టల్ బ్యాలెట్ కు మూడు రోజులే అవకాశం!

image

పార్లమెంట్ ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల కోసం ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు గాను కేవలం 3 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన కోరారు. జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో (6) ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News May 5, 2024

అడ్డగూడూరు: పిడుగుపాటుకు ఒకరి మృతి

image

పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అడ్డగూడూరు మండల పరిధిలోని కోటమర్తి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిప్పలపల్లి బాలమల్లు మేత కోసం పాడి గేదెను తన వ్యవసాయ బావి వద్దకు తోలుకెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఈదురు గాలులతో ప్రారంభమై వర్షం పడుతుండడంతో ఊరు ప్రక్కనే ఉన్న తన దొడ్డిలో ఆగగా పిడుగు పడి మృతి చెందాడు.

News May 5, 2024

అక్రమ వసూళ్లకు పాల్పడిన కానిస్టేబుల్ సస్పెండ్: ఎస్పీ చందనా

image

అక్రమ వసూళ్లకు పాల్పడిన కేతేపల్లి స్టేషన్‌కి చెందిన కానిస్టేబుల్ పి.మహేష్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 28న కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వాహనంలో 9 బీర్లు ఉండగా వారిని కేసు నమోదు బెదిరించి చేస్తామని చెప్పి పెట్రోల్ బంకు ద్వారా రూ.6 వేలు ఫోన్ చేయించుకోవడంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

News May 5, 2024

నల్లగొండలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

image

నల్లగొండలో ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు నేలమట్టమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురు గాలులకు వైర్లు తెగిపోయి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.