Nalgonda

News May 1, 2024

భువనగిరిలో త్రిముఖ పోరు..!

image

నిన్న మొన్నటి వరకు భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ పర్యటన, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదని సంకేతాలు కనిపిస్తున్నాయి. BRS అభ్యర్థి మల్లేశ్, కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్, BJP బూర నర్సయ్య గౌడ్ మధ్య రసవత్తర పోరు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

News May 1, 2024

నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

image

నల్లగొండ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నారు. మాడ్గులపల్లి మండల కేంద్రంలో రికార్డుస్థాయిలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాంపల్లి మండల కేంద్రంలో 45.9 డిగ్రీలు, చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం జిల్లా అంతటా 41.1 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడం, ఉక్కపోత కారణంగా జనం తల్లడిల్లుతున్నారు.

News May 1, 2024

6785 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు

image

జిల్లాలోని 466061 ఆహార భద్రతా కార్డులకు సంబంధించి మే నెలకు 6785.396 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు డీఎస్వో వెంకటేశ్వర్లు తెలిపారు. కార్డుదారులు చౌకధర దుకాణాలకు వెళ్లి బియ్యాన్ని తీసుకోవాలన్నారు. ప్రతి లబ్దిదారునికి 6 కిలోలు, అంత్యోదయ కార్డుదారునికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారునికి 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

News May 1, 2024

శాలిగౌరారం: వడదెబ్బతో యువకుడి మృతి

image

శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామానికి చెందిన మేతరి అనిల్ కుమార్ (32) వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అతడు కొంతకాలంగా గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను కొనసాగిస్తున్నాడు. రెండు రోజుల కింద ఎండ తీవ్రతతో పాటు, వంట వేడి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నల్గొండ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు బంధువులు, గ్రామస్థులు పేర్కొన్నారు.

News May 1, 2024

మిర్యాలగూడలో 96 శాతం ఉత్తీర్ణత!

image

మిర్యాలగూడ మండల పరిధిలోని 24 ప్రభుత్వ ZP ఉన్నత పాఠశాలల్లో 1,234 మంది విద్యార్థులు ssc పరీక్షలకు హాజరు కాగా 1,187 ఉత్తీర్ణులయ్యారని మండల విద్యాధికారి బాలాజీ నాయక్ తెలిపారు. 96 శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అదేవిధంగా 15 మంది విద్యార్థిని, విద్యార్థులు 10/10 జిపిఎ సాధించి ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. బాలుర కంటే బాలికలదే పైచేయని తెలిపారు.

News May 1, 2024

మే 2 నుంచి పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు: కలెక్టర్ హరిచందన

image

నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల విధులకు నియమించిన పీఓ, ఏపీఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుంచి 4 తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఇందుకుగాను పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు విధులను కేటాయించడం జరిగిందన్నారు.

News April 30, 2024

సూర్యాపేట: ప్రభుత్వ పాఠశాలలో 10జీపీఏ.. కలెక్టర్ సన్మానం

image

సూర్యాపేట జిల్లాలో పదో తరగతి పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సత్తా చాటారని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. జిల్లాలో 354 మంది విద్యార్థులకు 10 /10 జీపీఏ వచ్చిందని తెలిపారు. మైనార్టీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10/10 తెచ్చుకున్న విద్యార్థిని కే.హారికను కలెక్టర్ ఉపాధ్యాయులతో కలిసి సన్మానించారు.

News April 30, 2024

బీఆర్ఎస్ చచ్చిపోయింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

image

తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చిట్యాల ర్యాలీలో మాట్లాడారు. కారు కార్ఖానాకు కేసీఆర్ దవాఖానకు పోయిండని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 

News April 30, 2024

10th Result: నల్గొండ 9, సూర్యాపేట 6, యాదాద్రి 25వ స్థానం

image

పదోతరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో నల్గొండ 96.11 శాతంతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట 96.91 శాతంతో 6వ స్థానం.. యాదాద్రి భువనగిరి 90.44 శాతంతో 25వ స్థానంలో ఉంది. నల్గొండలో మొత్తం 19,263మంది పరీక్ష రాయగా.. 18,513 మంది ఉత్తీర్ణులైయ్యారు. సూర్యాపేటలో మెత్తం 11,910 మంది పరీక్ష రాయగా 11,542మంది.. యాదాద్రి భవనగిరిలో మొత్తం 9,108 పరీక్ష రాయగా 8,237 పాసయ్యారు.

News April 30, 2024

10th Result: నల్గొండలో 41,250 మంది వెయిటింగ్

image

నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. నల్గొండ జిల్లాలో 19,715 మంది, సూర్యాపేట జిల్లాలో 12,133, యాదాద్రి భువనగిరి 9,402 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.