India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువతి మృతి చెందింది. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన సౌమ్యగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30% పోలింగ్ నమోదయింది. ఎమ్మెల్సీ పరిధిలోని 12 జిల్లాలలో పోలింగ్ శాతం నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట-33.19, జనగాం-28.38, హన్మకొండ-32.90, వరంగల్-31.05, మహబూబాబాద్-28. 49, ములుగు-31.99, భూపాలపల్లి-27.69, భద్రాద్రి-25.79, ఖమ్మం-30.18, యాదాద్రి భువనగిరి-27.71, సూర్యపేట-31.27, నల్గొండ-26.94.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 29.30 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మొత్తం 605 కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.
☞ పోలింగ్ అధికారి ఇచ్చే పెన్నుతో బ్యాలెట్ పేపర్‌లో1,2,3,4 ఇలా ప్రాధాన్యత క్రమంలో వేయాలి
☞మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలి
☞ఒక్కరికి/కొందరికి/అందరికీ ఓటు వేయవచ్చు
☞ఆరుగురికి ఓటు వేయాలనుకుంటే.. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే అభ్యర్థి ఫోటో ఎదురుగా ఉండే బాక్స్‌లో 1 నంబర్ వేయాలి. మిగితా అభ్యర్థులకు 2,3,4,5,6 నంబర్లు రాయాలి
☞1,2,3 నంబర్లు వేసి, 4 వేయకుండా 5వ నంబర్ వేస్తే ఆ ఓటు చెల్లదు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక అడిషనల్ ఎస్పీ, 5 డీఎస్పీలు, 22 మంది సీఐలు, 64 మంది ఎస్ఐలతో కలిపి 1100 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు.
KMM-WGL-NLG పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మం. మాదాపురం ZPHSలో, BJP అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి HNKలోని సుబేదారి, హంటర్‌రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో, BRS అభ్యర్థి రాకేష్‌రెడ్డి HNKలోని వడ్డేపల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు.
ఈదురుగాలులతో పానగల్ చెరువులో ఒకరు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం.. చందనపల్లికి చెందిన కొందరు చేపలు పట్టడానికి చెరువులోకి వెళ్లారు. ఈ క్రమంలో ఈదురుగాలులు వీయడంతో చెరువులో గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు ఈత కొట్టుకుంటు పానగల్ కట్టవైపు వెళ్లి బయటపడగా.. కోడదల సైదులు చెరువులో గల్లంతయ్యారు. చీకటి వల్ల గాలించే పరిస్థితి లేకపోవడంతో సైదులు కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NLG-KMM-WGL శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, NLG-KMM-WGL ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఆదివారం ఆమె NLG జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆల్ఫాన్సెస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపు ఏర్పాట్లను తనిఖీ చేశారు.
రాష్ట్రస్థాయిలోని టెస్కాబ్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పైనా అవిశ్వాసం కోరుతూ డైరెక్టర్లు ఇటీవల నోటీసు అందజేశారు. టెస్కాబ్ ఛైర్మన్‌గా ఉన్న రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ ఛైర్మన్ కాగా, వైస్ ఛైర్మన్‌గా ఉన్న గొంగిడి మహేందర్రెడ్డి నల్లగొండ డీసీసీబీ ఛైర్మన్ ఈనెల 10న టెస్కాబ్‌లో నిర్వహించే అవిశ్వాస తీర్మానం నెగ్గితే వీరు ఆయా పదవులు కోల్పోనున్నారు.
DCCB బ్యాంకు ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు డైరెక్టర్లు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. డైరెక్టర్లలో పలువురు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరడంతో DCCBలో ఆ పార్టీ బలం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. డీసీసీబీ పీఠాన్ని అధీనంలోకి తీసుకోవాలని భావిస్తుంది.
Sorry, no posts matched your criteria.