India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భువనగిరి పార్లమెంట్ స్థానానికి 51 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా 12 మంది నామినేషన్లు సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యే ఇక్కడ పోటీ నెలకొని ఉంది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రలోభాలకు తావులేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. బెల్టు షాపులన్నింటినీ మూసివేయడంతోపాటు నిరంతర నిఘా ఏర్పాటుచేసి మద్యం ప్రవాహం ఓటర్లపై ఉండకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటి వరకు 140 కేసులను నమోదు చేయడంతోపాటు రూ.26.25 లక్షల విలువ కలిగిన 44వేల లీటర్ల మద్యం సీజ్ చేశారు.
NLG, BNGRస్థానాల్లో నలుగురు మహిళలు మాత్రమే బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నుంచి ఎవరూ పోటీలో లేరు. సోషలిస్టు పార్టీ తరఫున సుభద్రరెడ్డి నల్గొండ, భువనగిరి స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థినులుగా పాలకూరి రమాదేవి, పోతుల ప్రార్థన బరిలో నిలవగా.. భువనగిరి నుంచి జంగా సుజాత పోటీలో ఉన్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్నందున పోరులో ఎంత మంది ఉంటారో తేలనుంది.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంటే నల్లగొండ జిల్లాలో ముందస్తుగా వరి కోతలు రావడంతో జిల్లా యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని కొనుగోళ్లను కూడా ముందుగానే ప్రారంభించింది. అధికారులు.. ఒకపక్క లోక్ సభ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారిస్తూనే.. మరోపక్క ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 2,56,236 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. 40 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా మాడ్గులపల్లి మండల కేంద్రంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అత్యల్పంగా చింతపల్లి మండలం గోడకొండలో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
నల్గొండ, భువనగిరి స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన సభ చౌటుప్పల్‌లో ఖరారైంది. మే నెల 3న లేదంటే 7, 8 తేదీల్లో ఒక రోజు సభ ఉండే అవకాశం ఉందని రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ పాగా వేయాలని భావిస్తోంది. ఆ మేరకు మే నెల మొదటి వారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది.
నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా ఉన్నారు. భువనగిరి బీజేపీఅభ్యర్థి బూరనర్సయ్య 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. నల్గొండ బీఆర్‌ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డి 53 ఏళ్లు, బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి 49, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ 47, బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లేష్ 59, సీపీఎం జహంగీర్ 51 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో బాగంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ఠమైన తనిఖీలు నిర్వహిస్తూ రూ.11.7 కోట్లకు పైబడి నగదు, మద్యం, ఇతర వస్తువుల, స్వాదీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచామని, వాడపల్లి, అడవిదేవులపల్లి టెయిల్ పాండ్, సాగర్ వద్ద అంతరాష్ట్ర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నామన్నారు.
హుజూర్‌నగర్: ఎండల తీవ్రత పెరిగిపోయిన క్రమంలో స్థానిక 13వ వార్డులో వృద్ధుడు వడదెబ్బ తగిలి మరణించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. 13వ వార్డులో నివాసం ఉంటున్న ధార అంజయ్య (70 ) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వడదెబ్బ తగలడంతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం భువనగిరి సెగ్మెంట్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వల్లే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందన్నారు.
Sorry, no posts matched your criteria.