India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్లగొండ SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నందు గ్రామీణ ప్రాంత పురుషులకు సీసీటీవీ సర్వీసింగ్, రిపేర్స్‌లో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు రఘుపతి తెలిపారు. శిక్షణలో చేరుటకు చివరి తేదీ మే 24 అని, ఆసక్తి గలవారు సంస్థ కార్యాలయంలో లేదా 9701009265 ఫోన్ నంబర్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లా(నల్గొండ, సూర్యపేట, భువనగిరి)కు చెందిన వారై ఉండాలన్నారు.
నల్గొండ జిల్లా తిప్పర్తిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నిద్రమత్తులో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా.. భర్త పరిస్థితి విషమంగా ఉంది. కారులో ఉన్న ఇద్దరు పిల్లలు, కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గురుకుల నోటిఫికేషన్‌లో ఇచ్చిన 9210 ఖాళీలను నింపే సదుద్దేశంతో 2 నెలల క్రితం ప్రభుత్వం ఎంపికైన అభ్యర్ధులను గురుకుల సొసైటీలకు కేటాయిస్తూ అభ్యర్థులకు అలాట్మెంట్ ఆర్డర్స్ అందజేసి నిరుద్యోగుల జీవితాలలో ఆశలు చిగురించేలా చేసింది. ఇదే ఆర్డర్‌లో ప్లేస్ అఫ్ పోస్టింగ్‌ను విడిగా అందజేస్తామని చెప్పినప్పటికీ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఇప్పటివరకు అభ్యర్థులకు అందజేయలేదు. వందలాది మంది పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ఎస్వీ ల్యాబ్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ వద్ద లీకేజీ అవడంతో ప్లాంట్ ఇన్‌ఛార్జ్ నాగరాజు (34) మృతి చెందాడు పరిశ్రమలో పని చేస్తున్న మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నార్కట్ పల్లి శివారులోని నల్గొండ బైపాస్‌లో నల్గొండ, మిర్యాలగూడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే నాన్స్టాప్ బస్సులను నిలపడం కోసం ప్రత్యేక స్టాపులను ఏర్పాటు చేసినట్లు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. నార్కట్ పల్లి నుంచి హైదరాబాద్‌కు ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నుంచి నల్గొండ ఛార్జీ తీసుకుంటారని అన్నారు.
ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షను గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం సూర్యాపేటలో 1, కోదాడలో 2, నల్గొండలో 1 మొత్తం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షకు అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 1100 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్ సెట్ ఛైర్మన్ ఆచార్య గోపాల్రెడ్డి పేర్కొన్నారు.
నాగార్జున సాగర్‌లోని బుద్ధవనంలో బుద్ధ జయంతి ఉత్సవాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలు నిర్వహించడానికి పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో బుద్ధవనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో బౌద్ధ బిక్షవులతో బుద్ధ పాదుకల వద్ద ప్రత్యేక పూజలతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు బుద్ధవనంలోకి ఉచిత ప్రవేశ సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో రైస్ మిల్లర్లతో 2023- 24 వానాకాలం, యాసంగి కస్టమ్ మిల్లింగ్ రైస్ పై సమీక్షించారు. 2023- 24 వానాకాలానికి సంబంధించిన సీఎంఆర్ ను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దామరచర్లలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నాగరాజు పెద్ద కుమారుడు నాగధనుష్, ఆయన మరదలు కుమారుడు పెద్ది శెట్టి సాత్విక్ కొంతమంది పిల్లలతో కలిసి గ్రామ శివారులోని నాగుల చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈక్రమంలో వారికి ఈత రాక మునిగి మృతి చెందినట్లు తెలిపారు.
NLG -KMM-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని BRS, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించాలని BJP భావిస్తోంది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల తరఫున కీలక నేతలను రంగంలోకి దింపారు.
Sorry, no posts matched your criteria.