India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైకోర్టు ఆదేశాలతో మునగాల మండలం నూతన జడ్పీటీసీగా నారాయణగూడెం గ్రామానికి చెందిన దేశి రెడ్డి జ్యోతి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల ఎన్నిక చెల్లదంటూ జ్యోతి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. గత ఐదేళ్లుగా పలు కోర్టుల్లో ఈ కేసు విచారణ కొనసాగింది. చివరకు ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ చేసి జ్యోతిని జడ్పీటీసీగా కొనసాగాలని ఆదేశించింది.
పట్టభద్రులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న కాంగ్రెస్ పట్టభద్రుల MLC అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పోటీ నుంచి తప్పించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని MLC స్వతంత్ర అభ్యర్థి బక్క జడ్సన్ నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా తీన్మార్ మల్లన్న శాసన మండలికి పంపుతారా.. లేకుంటే శ్మశానానికి పంపుతారా అని బ్లాక్‌మెయిల్ చేశాడన్నారు.
భార్యతో గొడవ పడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మోతె మండలం ఊర్లుగొండ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొమరయ్య, రమా భార్యాభర్తలు. మే 15న భర్తతో గొడవ జరగ్గా పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంలో గ్రామశివారులో ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకుని కొమరయ్య సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి భార్య రమా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదవేంద్ర రెడ్డి తెలిపారు.
బస్ ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైవర్‌పై మహిళలు చేయి చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి MLG ఆర్టీసీ బస్టాండ్లో చోటు చేసుకుంది. DVK డిపోకు చెందిన బస్ అంగడిపేట వద్ద ఆపలేదు. దీంతో అక్కడున్న మహిళలు మరొక బస్సులో MLG బస్టాండ్‌కు చేరుకున్న ఆనంతరం ముందుగా వచ్చిన బస్సు డ్రైవర్‌ను బస్ ఎందుకు ఆపలేదని చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై డ్రైవర్, మహిళలు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. అనంతరం రాజీకొచ్చారు.
బుద్ధుని జయంతిని పురస్కరించుకొని ఈనెల 23న జరుపుకోనున్న బుద్ధ పూర్ణిమకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనం ముస్తాబైంది. ఇందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బుద్ధవనంలోని మహాస్థూపంతో పాటు దారుల వెంట విద్యుత్ దీపాలను అలంకరించడంతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
వరి విత్తనాల్లో సన్న రకాల సాగు మరోసారి తెర పైకి వచ్చింది. గతంలో సన్నాల సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఒక్క సీజన్‌కు మాట మార్చింది. ఇప్పుడు మళ్లీ సన్నాల సాగుకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాటి కష్టాలు, జరిగిన నష్టాల అనుభవంతో ఉన్న రైతులు సన్నాల సాగంటే భయపడుతున్నారు. రూ.500 బోనస్ రావాలంటే సాగు చేయక తప్పదని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల సన్నాల సాగు చేస్తున్నారు.
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై చర్చించడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ ఏవో, ఏడిఏతో పాటు ఉద్యాపన శాఖ అధికారులతో నల్గొండలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.
పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా HNRలో పంపిణీ చేసిన పోల్ చిట్టీల్లో పోలింగ్ కేంద్రం చిరునామాలో తెలుగు, ఆంగ్లంలో రెండు వేర్వేరు చిరునామాలు అచ్చు వేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. దీంతో అసలు తాము ఏ కేంద్రంలో ఓటు వేయాలా అనే గందరగోళంలో ఉన్నారు. అధికారులు మాత్రం బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా చూసి సంబంధిత పోలింగ్ కేంద్రానికి పోవాలని సూచిస్తున్నట్లు తెలిసింది.
NLG- KMM- WGL శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు ఓటు వేసే సందర్భంగా చేయదగినవి, చేయకూడని అంశాలపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వివరంగా తెలియజేశారు. ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్ తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వైలెట్ స్కెచ్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ఐఏఎస్ అధికారి నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది. MGUలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుత వీసీ గోపాల్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ వీసీగా నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది.
Sorry, no posts matched your criteria.