India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాను చనిపోతూ ఓ మహిళ ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూరుపేటలో అనారోగ్యం కారణంగా సుజాత మరణించింది. ఆమె అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆమె మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చినట్లైంది. తన గొప్ప మనస్సు చూసి ఆలేరువాసులు చలించిపోయారు.
వానాకాలం వ్యవసాయ సీజన్ కు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు పంటల ప్రణాళికను ఇప్పటికే రూపొందించారు. మూడు జిల్లాల్లో మొత్తం 21.50లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. సీజన్ కు ముందే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణశాఖ పేర్కొనడంతో… అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ సన్నద్ధమైంది.
ఉపాధ్యాయ నియామక, పదోన్నతుల కోసం విద్యాశాఖ అధికారులు నిర్వహించనున్న టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపు ఇబ్బందికరంగా మారుతోంది. పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు కోరుకున్న విధంగా సొంత జిల్లాలకు కేటాయించాల్సి ఉన్నప్పటికీ.. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, మల్కాజ్ గిరి, వరంగల్ జిల్లాలకు కేటాయించడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
NLG – KMM- WGL పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అందుకు ఇంకా వారం సమయం మాత్రమే ఉండటంతో అధికారులంతా పోలింగ్ ఏర్పాట్లలో తల మునకలయ్యారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్ బూత్ల ఏర్పాటు, జంబో పోలింగ్ బాక్సులు సమకూర్చడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర పనులు చేపడుతున్నారు.
ఈ నెల 27న జరగవలసిన డిగ్రీ 2, 3, సెమిస్టర్ల పరీక్షలను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డా.జి.ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల దృశ్యా తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. 27న జరగవలసిన పరీక్షలు జూన్ 13న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాధడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలం నూకలవారిగూడలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు తన భార్య జ్యోతిపై అనుమానం పెంచుకున్నాడు. జ్యోతి పొలంలో గేదెలు మేపుతుండగా అక్కడికి వెళ్లిన నాగరాజు కర్రతో దాడి చేయగా ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వం ఇసుక పాలసీపై స్పష్టమైన విధానాన్ని తీసుకురాకపోవడంతో కొన్ని చోట్ల పాత పద్ధతి ప్రకారం అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాలిగౌరారం మండలం వంగమర్తి నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా.. కాంట్రక్టర్ మాత్రం మూసీ అవతలి వైపు ఉన్న సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం పరిధిలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన కనగల్ మండలంలో వెలుగుచూసింది. SI రామకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు.. కనగల్‌కు చెందిన సత్తయ్య కుమారుడు నర్సింగ్ నితిన్(18) నల్గొండలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసి EAPCET రాశాడు. కాగా ఇటీవల విడుదలైన EAP సెట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నితిన్ ఆదివారం రాత్రి ఇంట్లో అందరు పడుకున్న సమయంలో ఉరేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదైంది.
2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం కింద జిల్లాకు 114 సీట్లు మంజూరైనట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 103 సీట్లు ST ఉపకులాలకు, 11 సీట్లు PTG (చెంచు) కులముల వారికి కేటాయించడం జరిగినది. మొత్తం సీట్లలో 33% బాలికలకు కేటాయిస్తూ (3వ తరగతి వారికి 50%) (5వ తరగతి వారికి 25%), (8వ తరగతికి 25%) సీట్లను తరగతి వారీగా కేటాయించినట్లు తెలిపారు.
నకిరేకల్‌లో నేడు నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశంలో MLA జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాడని అన్నారు. అలాంటి వారిని చట్టసభల్లోకి పంపిస్తే ఎలా ఉంటుందో పట్టభద్రులంతా ఆలోచించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని.. BRS MLC అభ్యర్థి రాకేష్ రెడ్డికి పట్టభద్రులంతా తోడుగా నిలవాలన్నారు.
Sorry, no posts matched your criteria.