India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. గతంలో ఈ స్థానం నుంచి గెలవకపోవడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, , కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లన్న గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తద్వారా గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కోదాడ పట్టణంలోని సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కరువును తీసుకువచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…
భానుడి ప్రభావం గృహజ్యోతి వినియోగదారులపై పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4,82,283 మంది ఉచిత కరెంట్ లబ్ధిదారులు ఉండగా ఏప్రిల్ నెలలో తీసిన లెక్కల ప్రకారం 4,73,314కి పడిపోయారు. ఒక్క నెలలోనే 8,969 మంది ఫథకాన్ని కోల్పోయారు. మేలో 4,60,864 మంది లబ్ధిదారులు మాత్రమే అర్హులయ్యారు. ఈ మూడు నెలల్లోనే 21,419 మంది పథకానికి దూరమయ్యారు. వాతవరణం చల్లబడడంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది.
గూడ్స్ వాహన డ్రైవర్ దారుణహత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం చెట్టవారిగూడేనికి చెందిన రాజవర్ధన్(35) శనివారం గూడ్స్ వాహనం లోడుతో VJD నుంచి HYDకు వెళ్లాడు. HYDలో సామాను దింపి రాత్రి VJDకు బయల్దేరాడు. మార్గం మధ్యలో ఎరసానిగూడెం స్టేజీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాజవర్ధన్‌ను అడ్డగించి హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసినట్లు ఎస్ఐ ఎన్.శ్రీను తెలిపారు
టెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ టెట్ పరీక్షలు ఈనెల 20న ప్రారంభమై జూన్ 2 వరకు కొనసాగుతాయి. వివిధ తేదీల్లో రకరకాల సబ్జెక్టులకు సంబంధించి టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో ఆన్లైన్ పరీక్షకు నల్గొండలోని ఎస్పీఆర్ పాఠశాల ప్రాంగణంలో సెంటర్ ఉంది. ఇక్కడ ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఒక్కో సెషన్‌కు సుమారుగా 180 మంది వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిలను నియమించింది. DVKకు మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పార్టీ కార్మిక విభాగం నాయకుడు రాంబాబు యాదవ్ , MLGకు భాస్కర్ రావు, రాజీవ్ సాగర్, మునుగోడుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాకేశ్ కుమార్, సాగర్‌కు నోముల భగత్, NKLకు చిరుమర్తి లింగయ్య, NLGకు కంచర్ల భూపాల్ రెడ్డిలను నియమించింది.
KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.
ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జూన్ 8 వరకు ప్రజావాణి ఉండదని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, అలాగే WGL- KMM -NLG పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నికల పోలింగ్, కౌంటింగ్ వంటి కారణాల వల్ల కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 8 వరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధించిందని జూన్ 8 వరకు ప్రజావాణి నిర్వహించడం లేదని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పంచాయతీ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించింది. ఫిబ్రవరిలోనే పంచాయతీలకు పదవీ కాలం ముగియడంతో అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీలకు జూన్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆశావహులు పోటీ చేసేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.