India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.80 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను 123.0112 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక
జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే మనుగడ ఉంటుందని సాగర్ ఆయకట్టు కింద అన్నదాతలు చెబుతున్నారు.
యాదాద్రి ఆలయంలో నిత్య కళ్యాణం, బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో భాస్కరరావు ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలో జూన్ 1 నుంచి నియమాలు కచ్చితంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్, చీర, లంగా వోణి వంటి దుస్తులు ధరించాలని చెప్పారు.
నల్గొండ మెడికల్ కళాశాల భవనాల సమూదాయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కళాశాల త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కళాశాల భవన సమదాయం నిర్మాణాలు 85 శాతం వరకు పూర్తి కావచ్చాయి. భవన సమూదాయాన్ని అక్టోబర్ చివరినాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ అధికారులు సెప్టెంబర్‌లోగా అన్ని పనులను పూర్తి చేసి అప్పగించాలన్న లక్ష్యంతో ఉన్నారు.
పెద్దవూర సమీపంలో పీడీఎస్ బియ్యందందా వ్యవహారంలో 9మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 16న మధ్యాహ్నం పోలీసులకు అందిన సమాచారం మేరకు తెప్పలమడుగు పరిధిలోని అమ్మ రైస్‌మిల్‌లో తనిఖీ చేశారు. ఒక లారీలో 550 బస్తాల పీడీఎస్ బియ్యం కలిగి ఉండటం గుర్తించి కేసు నమోదు చేశామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, ఇదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ హరిచందన సూచించారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శనివారం కలెక్టరేట్ లో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అలర్ట్ గా ఉండాలన్నారు .
నల్గొండ జిల్లాలోని 4 ప్రభుత్వ, 10 ప్రైవేట్ ఐటిఐలలో 2024-25/26 సంవత్సరం (ఒకటి, రెండు సంవత్సరాల కోర్సులకు) అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు నల్గొండ జిల్లా ఐటిఐల కన్వీనర్/ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు http://iti.telangana.gov.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి CPI(M) పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం అధికారిక ప్రకటన చేశారు. WGL-NLG-KMM ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతు ఇవ్వాలని CPI(M) నిర్ణయించిందని తెలిపారు. బిజెపిని ఓడించడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించారు.
నాగార్జునసాగర్ చేపల టేస్టే వేరు. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. సాగర్ వెనుక జలాలు, AMRP, ఏకేబీఆర్ ప్రాజెక్టులో లభించే చేపలు కొంచెం తియ్యగా, చప్పగా ప్రత్యేకంగా ఉండడంతో భోజన ప్రియులు ఈ చాపలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఈ చాపల కోసం బంగ్లాదేశ్ దేశ వ్యాపారస్తులు, అసోం వంటి రాష్ట్రాల వారు కొనుగోలు చేసుకుని వారి ప్రాంతాలకు తరలిస్తుండడంతో ఇక్కడి చేపలకు భలే గిరాకీ ఏర్పడింది.
బాలిక ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల, ఎస్ఐ కథనం ప్రకారం.. మిర్యాలగూడ మండలానికి చెందిన బాలిక(17) పారామెడికల్ కోర్స్ చదువుతోంది. తక్కెళ్ళపాడుకి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా నిందితుడు ప్రేమ పేరుతో వేధించడంతో పాటు, ఫోన్ తీసుకొని దాడి చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకున్నట్లు తెలిపారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో బాలుడికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జడ్జి శిరీష శుక్రవారం తీర్పు వెలువరించారు. నల్గొండ మండలం ఆర్జాలబావికి చెందిన బాలుడు 2020 జూలై 19న అదే కాలనీకి చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Sorry, no posts matched your criteria.