Nalgonda

News April 25, 2024

భువనగిరి బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్

image

సూర్యాపేట నుంచి భువనగిరిలో జరిగే పోరుబాట కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు. బుధవారం పోరు బాట అనంతరం సూర్యాపేటలోనే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇంట్లో బస చేసిన సంగతి తెలిసిందే.  సూర్యాపేట నుంచి అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా ఆయన భువనగిరికి చేరుకోనున్నారు. 

News April 25, 2024

’28న ప్రవేశ పరీక్ష.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి’

image

రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల సొసైటి ఆధ్వర్యంలో నడపబడుచున్న 23 పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 28న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ కే.లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు onlineలో ఆప్లై చేసిన విద్యార్ధులు https://telanganaexmes.egg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.

News April 25, 2024

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

image

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కలెక్టర్ హరి చందన దాసరి సూచించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు స్వయంగా రాసి, రికార్డు చేసిన పాటల సీడీని కలెక్టర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్ రోజు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో తాగునీరు, ఓఆర్ఎస్ తో పాటు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

News April 25, 2024

NLG: చివరి రోజు నామినేషన్ల జోరు

image

నల్లగొండలో నామినేషన్ల జోరు కొనసాగుతుంది. చివరి రోజు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు, MPCPI(U) పార్టీ అభ్యర్థిగా వసుకుల మట్టయ్య, బీఎస్పి పార్టీ అభ్యర్థిగా విరిగినేని అంజయ్య, సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా సుభద్రారెడ్డి , స్వతంత్ర అభ్యర్థులుగా పానుబోతు లాల్ సింగ్ నాయక్, తిరుగుడు రవికుమార్ తమ నామినేషన్లను దాఖలు చేశారు.

News April 25, 2024

చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆస్తులు, అప్పులు ఇవే..!

image

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.28,72,11,468గా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.5.2,59,650, భార్య చేతిలో రూ. 5.1,06,750 నగదు ఉన్నట్లు చూపించారు. ఇద్దరి పేరిట ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ రూ.19,47,81,000, చరాస్తులు రూ.9,24,30,468.. కాగా భార్యాభర్తల పేరున ఉన్న మొత్తం అప్పులు రూ.73,48,373గా చూపారు.

News April 25, 2024

NLG: రేవంత్ రెడ్డిని కలిసిన తీన్మార్ మల్లన్న

image

ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని అన్నారు.

News April 25, 2024

చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆస్తులు, అప్పులు ఇవే..!

image

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.28,72,11,468గా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన చేతిలో రూ.5.2,59,650, భార్య చేతిలో రూ. 5.1,06,750 నగదు ఉన్నట్లు చూపించారు. ఇద్దరి పేరిట ఉన్న మొత్తం స్థిరాస్తుల విలువ రూ.19,47,81,000, చరాస్తులు రూ.9,24,30,468.. కాగా భార్యాభర్తల పేరున ఉన్న మొత్తం అప్పులు రూ.73,48,373గా చూపారు.

News April 25, 2024

సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి ఎర్రపహాడ్ శివారు జాతీయ రహదారి-365 పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆత్మకురు(S) మండలం పాతర్లపహాడ్‌కు చెందిన భీమ గాని రాములు ఏకైక కుమారుడు గణేష్(24) లారీ డ్రైవర్. సొంత పనిమీద ద్విచక్ర వాహనంపై మాచినపల్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా బైక్ అదుపుతప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

News April 25, 2024

NLG: కేసీఆర్ మీటింగ్‌లో దొంగల చేతివాటం..!

image

తిప్పర్తి మండల కేంద్రంలో బుధవారం జరిగిన మాజీ సీఎం కేసీఆర్ మీటింగ్లో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే జేబులోని పర్సు, తిప్పర్తికి చెందిన జాకటి డానియల్, ఏశబోయిన మల్లేష్ మెడలోని తులంన్నర బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వీరితో పాటు రామలింగాలగూడెంకు చెందిన వనపర్తి నాగేశ్వరరావు చెందిన రూ.15వేల నగదును దుండగులు చోరీ చేసినట్లు తెలుస్తుంది.

News April 25, 2024

అతివేగంతోనే రోడ్డు ప్రమాదాలు: ఎస్పీ చందనా దీప్తి

image

అతి వేగం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ చందనా దీప్తి అన్నారు. తమ ప్రాణాలే కాకుండా తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను, ఎదుటివారిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. మద్యం తాగి, సెల్ ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.