Nalgonda

News April 22, 2024

NLG: టెట్ పరీక్షకు 27, 491 మంది దరఖాస్తు

image

టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్‌కు ఉమ్మడి జిల్లా నుంచి 27,491 మంది దరఖాస్తు చేశారు. పేపర్-1 విభాగంలో మొత్తం 8,130 మంది, పేపర్-2లో 19,361 మంది దరఖాస్తు చేశారు. NLG జిల్లాలో పేపర్-1లో 3,954 మంది, పేపర్-2లో 9,162 మంది దరఖాస్తు చేశారు. SRPT జిల్లాలో పేపర్-1లో 3,242 మంది, పేపర్-2లో 5,767 మంది దరఖాస్తు చేసుకోగా, యాదాద్రి-BNG జిల్లాలో పేపర్-1లో 934 మంది, పేపర్- 2లో 4,492 మంది దరఖాస్తు చేశారు.

News April 22, 2024

NLG: 24న రఘువీర్ రెడ్డి నామినేషన్

image

నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్రెడ్డి ఈనెల 24న నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరి నామినేషన్ సమర్పిస్తారు. 12 గంటలకు గడియారం సెంటర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నామినేషన్, బహిరంగ సభలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి పాల్గొననున్నారు.

News April 22, 2024

హనుమాన్ జయంతికి కట్టుదిట్టమైన భద్రత:SP

image

ఈ నెల 23న హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. హనుమాన్ శోభాయాత్రలో ప్రజలకు ఎలాంటి ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన మార్గం ద్వారా సమయపాలన పాటిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలన్నారు. శోభ యాత్ర సమయంలో ఇతర మతాల మనోభావాలను కించపరిచే విధంగా నినాదాలు చెయ్యవద్దన్నారు.

News April 21, 2024

NLG: RTC డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్.. సజ్జనార్ ట్వీట్

image

దేవరకొండ RTC డిపో డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై RTC ఎండీ సజ్జనార్ స్పందించారు. RTC అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరయ్యారు. అయినా ఈ నెల 20న అధికారులు డ్యూటీ కేటాయించారు. డ్రైవర్ శంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

News April 21, 2024

మానవత్వం చాటిన CI

image

నారాయణగూడ CI మానవత్వం చాటుకున్నారు. ఆదివారం TSRJC పరీక్ష రాయడానికి నల్గొండ నుంచి విద్యార్థిని వైష్ణవి నారాయణగూడకు చేరుకుంది. తీరా ఇక్కడికి వచ్చాక పరీక్షా సెంటర్‌ అంబర్‌పేటలోని ప్రభుత్వం బాయ్స్‌ స్కూల్ అని తేలియడంతో‌ రోడ్డు వెంబడి కంగారుగా‌ బయల్దేరింది. ఇది గమనించిన CI చంద్రశేఖర్‌ పోలీస్ వాహనంలో ఎక్కించుకొని 2 నిముషాల ముందే సెంటర్ వద్దకు చేర్చి, ఆదర్శంగా నిలిచారు.

News April 21, 2024

సీఎం రేవంత్‌కి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే..

image

సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి బ్రదర్స్ తోడైతే ఆపోజిషన్ పార్టీలు ఉంటాయా అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. మళ్ళీ 20 సంత్సరాలు ఎవరు మాట్లాడరు అన్నారు. నల్గొండలో 12కి 12 గెలుస్తామని చెప్పామని.. కానీ కొద్దిలో సూర్యాపేట పొట్టోడు మిస్ అయ్యాడన్నారు. భవనగిరిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు.

News April 21, 2024

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 507.30 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 127.1321 టీఎంసీల నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 6,398 క్యూసెక్కులు ఉంది.

News April 21, 2024

కాసేపట్లో భువనగిరికి సీఎం

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసేపట్లో భువనగిరికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొంటారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి వినాయక చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహిస్తారు. కాగా.. రేవంత్ సీఎం అయ్యాక భువనగిరికి రావడం మొదటి సారి. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వాగతం పలికడానికి భారీగా ఏర్పాట్లు చేశారు.

News April 21, 2024

REWIND.. నల్గొండ నుంచి 480 మంది పోటీ

image

28 ఏళ్ల కిందట నల్గొండ లోకసభ ఎన్నికల్లో 480 మంది అభ్యర్థులు పోటీలో నిలిచి రికార్డు సృష్టించారు. ఒకే పార్లమెంట్ స్థానం నుంచి 480 మంది అభ్యర్థులు బరిలోకి దిగడానికి నీటి సమస్యే అసలు కారణం. జిల్లా నుంచే జీవ నదులు ప్రవహిస్తున్నా నీటి కేటాయింపులో మాత్రం వివక్ష ఎదురవుతోందని జల ఉద్యమకారులు భావించారు. కృష్ణానది జలాల్లో 76 శాతం వాటా తమకు రావాల్సిన ఉన్నా రాజకీయాల కారణంగా అది దక్కకుండాపోయిందని పోరాటం చేశారు.

News April 21, 2024

నల్గొండ: సెలవు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం

image

ఆదివారం సెలవు ఇవ్వనందుకు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు ఓ ఆర్టీసీ డ్రైవర్. దేవరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పనిచేస్తున్న శంకర్ ఆదివారం సెలవు కావాలని ఉన్నతాధికారులను అడగ్గా కుదరదని చెప్పడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.