India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో నల్గొండలోని గాంధీనగర్‌కు చెందిన గండమళ్ల సన్‌హిత్ దేవ్ సత్తా చాటాడు. శ్రీను ప్రసన్న దంపతులకు చెందిన సన్‌హిత్ ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ ఫలితాల్లో 470కి 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. దీంతో సన్‌హిత్‌కు బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.
సెకండియర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా 68.45 శాతంతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. 11,474 మందికి 7854 మంది పాసయ్యారు. సూర్యాపేట జిల్లా 62.74 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. 6,063 మందికి 3804 మంది పాసయ్యారు. యాదాద్రి భువనగిరి 62.64 శాతంతో 25వ స్థానంలో నిలిచింది. 4446 మందికి 2785 మంది పాసయ్యారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా 57.2 శాతంతో రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. 11,555 మందికి 6,610 మంది పాసయ్యారు. యాద్రాద్రి భువనగిరి 51.04 శాతంతో 26వ స్థానంలో నిలిచింది. 4,561 మందికి 2,328 మంది పాసయ్యారు. సూర్యాపేట జిల్లాలో 49.42 శాతంతో 28వ స్థానంలో నిలిచింది. 6,637 మందికి 3,280 మంది పాసయ్యారు.
నేడు ఇంటర్ ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. NLG జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 32,895 మంది విద్యార్థులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 16,602 మంది విదార్థులు ఉన్నారు. యాదాద్రి జిల్లాలో కలిపి ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి 12,559 విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ MGU రిజిస్ట్రార్ అల్వాల రవి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం, ఇతర అడ్మినిస్ట్రేషన్ విభాగాలు యథావిధిగా పని చేస్తాయని ఒక ప్రకటనలో తెలిపారు.
మాజీ సీఎం KCR తన బస్సు యాత్రను నల్గొండ నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో ర్యాలీలు, రోడ్ షోల్లో KCR పాల్గొనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు మిర్యాలగూడకు చేరుకొని అక్కడ రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు సూర్యాపేట రోడ్డు షోలో పాల్గొనున్నారు. రాత్రి సూర్యాపేటలో బస చేస్తారు.
మిర్యాలగూడ పట్టణంలో వీరహనుమాన్ శోభాయాత్రను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి శోభయాత్ర కాషాయ జెండాలు చేతపట్టి భక్తులు భారీ ఆంజనేయ విగ్రహంతో పట్టణంలో డిజే భక్తి గీతాల మధ్య నృత్యాలు, కోలాటాలు ఆడుతూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మునిసిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్, రేపాల పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.
భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఫామ్ తీసుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో అందజేశారు. తన 25 ఏళ్ల కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చారని ఆయన చెప్పారు. ఎంపీగా గెలిచి ప్రజా సమస్యలపై పోరాడతానని వెల్లడించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు తనకు సంపూర్ణంగా ఉందని తెలిపారు.
NLG పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. మొత్తం ఓటర్లలో వారే అత్యధికంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వారి తీర్పే కీలకం కానుంది. ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 17,22,521 అందులో పురుషులు 8,43,496, మహిళలు 8.78,856, ట్రాన్స్ జెండర్లు 169 మంది ఉన్నారు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగతా ఆరింటిలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.
నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ బస్సు యాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసినా భువనగిరి, నల్గొండలో డిపాజిట్ దక్కదన్నారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదని త్వరలో తండ్రీ కొడుకులు కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
Sorry, no posts matched your criteria.