Nalgonda

News April 24, 2024

సూర్యాపేట: చిన్నారులకు నాయనమ్మ చిత్రహింసలు

image

ముగ్గురు చిన్నారులను నాయనమ్మ చిత్ర హింసలకు గురి చేసి కాల్చి వాతలు పెట్టిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గరిడేపల్లి మండలం రాయినిగూడెం వద్ద ముగ్గురు పిల్లలు ఉండగా వారిని స్థానికులు గుర్తించి వివరాలు అడిగారు. నాయనమ్మ సీతమ్మ తమని కొట్టి వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేసిందని చిన్నారులు ఆరోపించారు. వారిని పాలకీడు మండలం గూడుగుండ్ల పాలానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.

News April 24, 2024

కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ నారాయణరెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తారా..?

image

ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీయే లక్ష్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్, మంత్రి ఉత్తమ్‌ పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి నుంచి 4 లక్షల మెజార్టీ వస్తుందని, నల్గొండ నుంచి ఉత్తమ్ దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధిస్తానని సవాల్ విసురుకుంటున్నారు. దీంతో వీరు దివంగత ఎంపీ రావి నారాయణరెడ్డికి వచ్చిన రికార్డును బ్రేక్​ చేస్తారా అనే చర్చ మొదలైంది. రావికి 1952లో 2,72,280మెజార్టీ వచ్చింది.

News April 24, 2024

నల్గొండ వర్సెస్ భువనగిరి

image

నల్గొండ, భువనగిరి ​స్థానాలు కాంగ్రెస్​ నేతలకు సవాల్​గా మారాయి. నల్గొండ వర్సెస్ ​భువనగిరి మధ్య జరుగుతున్న పోటీగానే కాంగ్రెస్​ భావిస్తోంది. భువనగిరిలో 4లక్షల మెజార్టీ సాధించాలని ఆ బాధ్యత రాజగోపాల్​రెడ్డిపైనే ఉందని మంత్రి వెంకట్​రెడ్డి చెప్పారు. అటు నల్గొండలో దేశంలోనే భారీ మెజార్టీ సాధిస్తామని ఉత్తమ్​కుమార్​రెడ్డి అన్నారు. ఇద్దరు మంత్రులు భారీ మోజార్టీ సాధిస్తామని శపథం చేయడం ఆసక్తిగా మారింది.

News April 24, 2024

NLG: సైదిరెడ్డి ఆస్తులు.. అప్పులు ఇవే..!

image

NLG బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన కుటుంబ ఆస్తులు రూ.31,33,55,479గా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో చూపించారు. అదేవిధంగా రూ.6,10,9131 అప్పులు.. తన చేతిలో రూ.45వేల నగదు ఉన్నట్లు చెప్పారు. HYD బంజారాహిల్స్ DCCBలో రూ.7,97,650, యూనియన్ బ్యాంకులో రూ.3,60,940, SBIలో రూ.18,17,072, ICICIలో రూ.10లక్షల డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే కెనడాలో రెండు ఇళ్లు ఉన్నాయని తెలిపారు.

News April 24, 2024

NLG: రేపటి నుంచే వేసవి సెలవులు: డిఇఓ

image

బుధవారం నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించినట్లు నల్లగొండ డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలవు రోజుల్లో జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే ఆయా పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 24, 2024

మునగాలలో మళ్లీ రోడ్డు ప్రమాదం

image

సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పశువులు అడ్డురావడంతో అదుపుతప్పి పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ప్రమాద సమయంలో 30 ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిన్న కూడా మునగాల వద్ద కారు కంటైనర్ కిందకి దూసుకెళ్లిన విషయం తెలీసిందే.

News April 24, 2024

నల్లగొండలో శోభాయాత్ర రూట్‌ MAP ఇదే!

image

నేడు NLGలో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. యాత్ర కొనసాగే‌ రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు. మునుగోడు రోడ్డులోని హనుమాన్ టెంపుల్ నుంచి ప్రారంభమై వీటీ కాలనీ టెంపుల్‌ వరకు కొనసాగుతుంది. పూల్ సెంటర్, ఓల్డ్ చౌరస్తా, క్లాక్ టవర్, శివాజీ స్టాచ్యూ, ఎల్‌వి ప్రసాద్ హస్పటల్ ల్యాండ్ మీదుగా వీటీ కాలనీ హనుమాన్ టెంపుల్‌కు చేరుకుంటుంది. ఈ రోజు సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు ఈ రూట్‌లో ఆంక్షలు ఉంటాయి.

News April 24, 2024

NLG: సూక్ష్మ పరిశీలకులది కీలక బాధ్యత

image

లోక సభ ఎన్నికలలో సూక్ష్మ పరిశీలకులది కీలక బాధ్యత అని జిల్లా ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రవణ్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ ఆడిటోరియం హాలులో సూక్ష్మ పరిశీలకులకు ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో భాగంగా 374 మంది సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

News April 24, 2024

మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైన ఓ మహిళను పోలీసులు కాపాడారు. భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహిళ తన భర్త గొడవపడ్డాడని పట్టణ పరిధిలోని రైల్వే ట్రాక్ పైకి వెళ్తుండగా గమనించిన పోలీసులు ఆ సదరు మహిళను అడ్డుకొని నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులను జిల్లా వాసులు తోటి పోలీస్ సిబ్బంది అభినందిస్తున్నారు.

News April 24, 2024

సూర్యాపేట: కాలేజ్‌కి వెళ్లే టెన్షన్‌లో ఘోరం

image

మునగాల మండలం ముకుందాపురం వద్ద <<13101789>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతి చెందిన దంపతులు వివరాలు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన సామినేని నవీన్ రాజ, భార్గవి దంపతులు సోమవారం ఉదయం 6 గంటలకు విజయవాడకు బయలుదేరారు. నవీన్ రాజా విజయవాడలో శ్రీచైతన్య కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. కళాశాలకు చేరుకోవాలని కంగారులో అతివేగంగా డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.