Nalgonda

News April 19, 2024

పెరిగిన ఉష్ణోగ్రతలు.. బీర్ల అమ్మకాలు జోరు..

image

ఉమ్మడి జిల్లాలో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు మద్యం ప్రియులు లీటర్లకు లీటర్లు బీర్లను లాగించేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉండడంతో అదే స్థాయిలో బీర్ల విక్రయాలు పెరిగాయని అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని కొన్ని మద్యం దుకాణాల్లో బీర్లు దొరకడం లేదు.

News April 19, 2024

గ్రామీణ యువతులకు బ్యూటీ పార్లర్ కోర్సులో ఉచిత శిక్షణ

image

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతులకు బ్యూటీపార్లర్ కోర్స్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు SBI RSET డైరెక్టర్ ఈ.రఘుపతి శుక్రవారం తెలిపారు. 30 రోజుల పాటు ఉచిత శిక్షణను భోజన, వసతి సౌకర్యములతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీలోపు నల్గొండ పట్టణంలోని రామ్ నగర్ లో గల SBI RSET కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News April 19, 2024

రఘుబాబు అరెస్టు.. గంటల వ్యవధిలోనే బెయిల్

image

టాలీవుడ్ నటుడు రఘుబాబు కారు ఢీకొని నల్గొండ  BRS నేత సందినేని జనార్దన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. గంటల వ్యవధిలోనే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు.

News April 19, 2024

బావిలో పడి పశువుల కాపరి మృతి

image

కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకి చెందిన దాసరి వెంకటేశ్వర్లు శుక్రవారం పశువులు మేపడానికి పొలానికి వెళ్ళాడు. కాగా దాహం వేయడంతో మంచినీళ్లు తాగడం కోసం బావిలోకి దిగి ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోదాడ రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు.

News April 19, 2024

పోస్టల్ బ్యాలెట్ పై అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు , అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులందరికీ ఫారం- 12 అందినట్లు సంబంధిత శాఖల అధికారులు ధ్రువీకరణ ఇవ్వాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో NLG పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో పోస్టల్ బ్యాలెట్ విషయమై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

News April 19, 2024

NLG: రెండో రోజు నాలుగు నామినేషన్లు

image

లోకసభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా రెండో రోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు, ధర్మ సమాజ్ పార్టీ తరఫున తలారి రాంబాబు, మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) తరఫున వసుకుల మట్టయ్య, కిన్నెర యాదయ్య స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కోసెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారు.

News April 19, 2024

మిర్యాలగూడలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

image

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన దేవరకొండ రాంబాబు (55) జిల్లాలో పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు రాంబాబును మిర్యాలగూడ లో పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.16 లక్షల 24 వేల విలువ గల 20 తులాల 3 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

News April 19, 2024

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు నమోదు

image

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. తుర్కయాంజల్‌లోని 200 గజాల ప్లాట్ కబ్జా చేశారంటూ ఆదిభట్ల పీఎస్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు కిరణ్ పై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

News April 19, 2024

సూర్యాపేట: క్షుద్ర పూజలు కలకలం

image

తుంగతుర్తిలో క్షుద్ర పూజలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని బాపన్ బాయి తండా ఎక్స్ రోడ్‌లో పసుపు కుంకుమ, నిమ్మకాయలు, బొమ్మతో చేసిన క్లాత్‌తో  గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. గత రాత్రి చేసినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. 

News April 19, 2024

భువనగిరి ఎంపీ స్థానానికి సీపీఐ (ఎం) అభ్యర్థి నామినేషన్

image

భువనగిరి పార్లమెంట్ స్థానానికి సీపీఐ (ఎం) పార్టీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ వేశారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, నాయకులు కొండమడుగు నరసింహలతో కలిసి రిటర్నింగ్ అధికారి హనుమంత్ కే జెండగేకు నామినేషన్ పత్రాలు అందజేశారు.