India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీలో కేంద్ర జాతీయ రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కారణంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్- విజయవాడ ఆరు లైన్ల జాతీయ రహదారి పనులను పునర్ ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన మహేష్ వ్యవసాయ కూలీల పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన మహేష్ తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గొర్రెల కాపరులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నల్గొండ జిల్లాలో అర్హులందరికీ గృహ జ్యోతి పథకం అందట్లేదు. అర్హత ఉన్నా 200యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ దరఖాస్తుల్లో పొరపాట్లను చూపుతూ అధికారులు వేలాది మందిని గృహజ్యోతికి అనర్హులను చేశారు. ఉచిత విద్యుత్‌కు 2.80లక్షల దరఖాస్తులు చేయగా.. పొరపాట్లతో 2.07లక్షల మందికి వర్తింప చేస్తున్నారు. మొదట రేషన్, ఆధార్ ఆధారంగా దరఖాస్తు చేసుకోమనగా.. పేద, మధ్యతరగతి ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు.

జాతీయ రహదారుల మంజూరులో తెలంగాణకు అగ్రస్థానం లభించేలా ప్రత్యేక చొరవ చూపాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. తెలంగాణ బిడ్డ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోమవారం వారిని మర్యదపూర్వకంగా కలిసి సత్కరించారు. గత పదేండ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వానికి సహాయసహకారాలు అందించాలని కోరారు.

నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన రెహమాన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. పర్వతనేని నాగేశ్వరరావుకు చెందిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌లో రెహమాన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే కాంప్లెక్స్‌లో శివ పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. రెహమాన్, శివ మధ్య గొడవ జరగగా శివ రెహమాన్ ను హత్య చేసి శవాన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లో పూడ్చి పరారైనట్లు తెలిపారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో నల్గొండ జిల్లాలో 3,994 మంది హాజరవగా2,286 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 57.24గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 2,364 మంది పరీక్ష రాయగా 1,448 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.25గా ఉంది. యాదాద్రి జిల్లాలో 1,835మందికి 1043 (56.84) మంది పాసయ్యారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో నల్గొండ జిల్లాలో 3,994 మంది హాజరవగా2,286 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 57.24గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 2,364 మంది పరీక్ష రాయగా 1,448 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.25గా ఉంది. యాదాద్రి జిల్లాలో 1,835మందికి 1043 (56.84) మంది పాసయ్యారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్టియర్ లో నల్గొండ జిల్లాలో 7,459 మంది హాజరవగా 4,962 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 66.52గా ఉంది. సూర్యాపేట జిల్లాలో 4,565 మంది పరీక్ష రాయగా 2,712 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 59.41గా ఉంది. యాదాద్రి జిల్లాలో 3,007మందికి 1969 (65.48%) మంది పాసయ్యారు.

తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి 30 నిమిషాల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. నేడు సోమవారం కావడంతో భక్తులు కొండపై సాధారణంగా కనిపించారు. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.

చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం జాతీయ రహదారిపై 65పై దారిదోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఖమ్మంకి చెందిన ఉపేందర్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా కారులో చోరీ జరిగింది. దాబా వద్ద నిద్రించగా గుర్తుతెలియని వ్యక్తుల కారులోంచి రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందంతో పోలీసులు గాలిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.