India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు సరికొత్త ఛాలెంజ్ ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ సెగ్మెంట్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భువనగిరి నియోజకవర్గానికి ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఇన్‌ఛార్జులుగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ రెండు సెగ్మెంట్లలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు నెలకొనడంతో.. వారిద్దరూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం అడుగంటిపోతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 508.80 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 129.6422 టీఎంసీల నీరు ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 6,500 క్యూసెక్కులుగా ఉంది.
పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన రామావత్ ఉదయశ్రీ గత 9 నెలలుగా నిడమనూరు బ్రాంచి-4 పోస్టు ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్నారు. MLGలో తన బాబాయి ఇంట్లో ఉంటూ విధులకు వచ్చి వెళ్ళేది. అదే విధంగా ఈ నెల 12న విధులకు వెళ్తున్నానని చెప్పి, ఇంటికి తిరిగి రాలేదు. బంధువులను, స్నేహితులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఆమె తండ్రి శ్రీను సోమవారం నిడమనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఎన్నికలపై BJP ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ ను సంసిద్ధులుగా చేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ సంకల్ప్ పత్ర పేరుతో విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ BNG మండల పరిధిలోని చందుపట్లకు చెందిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.25 వేలు జరిమానా విధిస్తూ.. RR జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి సోమవారం తీర్పునిచ్చారు. బాధిత బాలికకు రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫార్సు చేసింది. 2017లో బాలికను అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఉమ్మడి జిల్లాలో ఓటర్ నమోదు గడువు తేదీ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా.. ఫిబ్రవరి 8న ఓటరు తుది జాబితాను విడుదల చేసిన విషయం విధితమే. ఈ జాబితాలో ఉమ్మడి జిల్లాలో 3533 పోలింగ్ కేంద్రాల్లో 29,20,119 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితా వెలువడిన నాటి నుంచి ఈనెల 15 వరకు ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
లోక సభ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు పూర్తి సహకారం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్ కోరారు. సోమవారం అయన కలెక్టరేట్లో నామినేషన్ల ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 18 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాలపై చర్చించారు.
స్టేట్ బ్యాంకు ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రామీణ మహిళలకు బ్యూటీ పార్లర్ లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు SBI-RSETI డైరెక్టర్ రఘుపతి తెలిపారు. భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. 19 నుండి 45 ఏళ్ల మధ్య వుండి 10వ తరగతి పాసైన నిరుద్యోగ గ్రామీణ మహిళలు ఈనెల 18 లోపు SBI, ఆర్సెటి రాంనగర్, నల్గొండలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎండాకాలంలో పశువుల దాహం తీర్చడానికి ఉపాధిహామీ నిధులతో నిర్మించిన నీటి తొట్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని గ్రామాల్లో నీళ్లతో ఉండాల్సిన తొట్లలో చెత్తాచెదారం పేరుకుపోయాయి. NLG, SRPT, యాదాద్రి BNG జిల్లాలోని అనేక గ్రామాల్లో మూడేళ్లక్రితం గ్రామానికి రెండు చొప్పున పశువుల నీటి తొట్లు నిర్మించారు. కానీ ఎక్కడా తొట్లలో నీళ్లు నింపి పశువులకు దప్పిక తీరుస్తున్న దాఖలాలు లేవని రైతులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు జరిపిన తనిఖీలలో తగిన పత్రాలు లేని 9.17 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, బంగారం ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచామని వాడపల్లి, అడవిదేవులపల్లి టెయిల్పాండ్, నాగార్జునసాగర్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.