India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యాదగిరి శ్రీవారి దేవస్థాన 2023- 24 ఆర్థిక సంవత్సర ఆదాయం వ్యయాలు ఆలయ ఈవో వెల్లడించారు. అందులో వసతి గృహాలు, హుండీలు, వ్రతాలు,VIP& బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు, తలనీలాలు, ప్రసాదాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ. 224,25,87,229 ఆదాయం వచ్చింది. సిబ్బంది వేతనాలు, పెన్షన్లు, ప్రసాదాల సరుకులు, ప్రభుత్వ పన్నులు, సేవలు, ఎలక్ట్రానిక్ & వాటర్, భక్తుల వసతులు తదితర విభాగాల కలిపి రూ. 214,55,85,249 వ్యయం.
ఉమ్మడి జిల్లాపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలతో క్షేత్రస్థాయిలో జోరు పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఉమ్మడి జిల్లాలోని NLG, BNG పార్లమెంటు స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తుండటంతో పోటీ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఈసారి బిజెపి రెండు స్థానాల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది.
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఉన్నతాధికారులు ఓట్లను లెక్కించే ప్రాంతాలను గుర్తించి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు దుప్పల్లి వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ గోదాములో చేపడతారు. భువనగిరి ఓట్ల లెక్కింపు రాయగిరి అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో చేపడతారు. భువనగిరి స్థానం 2009లో ఏర్పడినప్పటి నుంచి ఇక్కడే ఓట్లు లెక్కిస్తున్నారు.
నల్గొండలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెంలోని నూకల వెంకట్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రి ఫార్మసీ అనుమతి కోసం 20,000 డిమాండ్ చేశాడు. భాదితుడు సోమశేఖర్‌కు రూ. 18 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. తొలుత షర్మిల పార్టీలో చేరిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. ఈరోజు హైదరాబాద్‌లో పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో ఓటర్ల పేరుతో వెలిసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజకీయ పార్టీలు, నాయకులను ఆలోచింపజేస్తుంది. ఉచిత పథకాలు, గ్యారంటీలు ప్రకటించిన పార్టీలకు ఇది చెంపపెట్టు అని ప్రచారం జరుగుతుంది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ఠ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ చందనా దీప్తి ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వెంట నిఘా ఉంచామన్నారు. వాడపల్లి, అడవిదేవులపల్లి, టైల్ పాండ్, నాగార్జునసాగర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ రవాణా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. పారామిలిటరీ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన అధికారుల సహాయంతో జిల్లా మొత్తం ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు.
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. జిల్లాలో ఆదివారం ఒక్కరోజే ముగ్గురు చనిపోయారు. రామన్నపేట మండలానికి చెందిన రమేశ్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో చనిపోయారు. పాలకవీడు మండలం యల్లాపూరం గ్రామానికి చెందిన రమణారెడ్డి బైక్‌పై వెళ్తుండగా కల్వర్టును ఢీకొని మృతి చెందాడు. చౌటుప్పల్ మండలానికి చెందిన యాదయ్య XLపై పంతంగి గ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది.
భువనగిరి పట్టణంలోని డాక్టర్ చావా రాజ్‌కుమార్ కుమారుడు చావా తారక్‌నంద ప్రతిభ చాటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కించుకున్నాడు. శనివారం దిల్లీలోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన పోటీల్లో అతి తక్కవ సమయం 42 సెకండ్లలో ప్రపంచంలోని 100 దేశాల రాజధానుల పేర్లను ఏకధాటిగా చెప్పాడు. దీంతో రికార్డు తన సొంతం చేసుకున్నాడు.
రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ , మైనారిటీల సంక్షేమ శాఖ వారు UPSC – CSAT 2025 పరీక్ష కోసం 100 మంది మైనారిటీ అభ్యర్ధుల నుండి ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీ ఈ నెల 22 వరకు పొడిగించడం జరిగిందని తెలిపారు. ఆసక్తి కలిగిన మైనారిటీ విధ్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.