India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్లగొండ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన TGPSC గ్రూప్ – II కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను వెబ్ సైట్: https://tgbcstudycircle.cgg.gov.in లో బుధవారం నుండి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

2024-25 సంవత్సరానికై షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ హైద్రాబాద్ లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ (పదినెలలు)ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందిని రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉతీర్ణులైన వారు ఆన్ లైన్ ద్వారా జూలై 10వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఆహార భద్రత కార్డుదారులకు జూన్ నెలకి సంబంధించి ఉచిత బియ్యాన్ని ఈనెల 19 వరకు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు ఈనెల 19 వరకు తీసి ఉంచాలని.. ప్రతి కార్డుదారునికి బియ్యం పంపిణీ చేయాలని.. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిడమనూరు పోలీస్ స్టేషన్లో ఎర్రబెల్లికి చెందిన వెంకయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. భూవివాదంలో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని మనస్థాపం చెంది మంగళవారం వెంకయ్య పురుగుల మందు తాగినట్లు తెలుస్తుంది. వెంకయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. మంగళవారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.50 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు 122.5225 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఇక నందికొండ ప్రజలకు తాగు నీటికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతోంది.

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. మంగళవారం అందిన సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.50 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు 122.5225 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఇక నందికొండ ప్రజలకు తాగు నీటికి కూడా కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతోంది.

నల్లగొండ జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తామని, వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పమన్నారు.

భూముల మార్కెట్ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. NLG, BNG, SRPTల్లో వాస్తవ ధరలకు, మార్కెట్ వెలకు భారీ వ్యత్యాసం ఉందని గుర్తించి వాటి అంతరాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

నల్లగొండ జిల్లాలో 3 రోజుల వ్యవధిలో జిల్లా ఉన్నతాధికారులు ఇద్దరు బదిలీ కావడం చర్చనీయంశంగా మారింది. వీరిద్దరూ జిల్లాకు ఈ ఏడాది తొలి వారంలో వచ్చారు. వచ్చిన 6నెల్లలోపే బదిలీ అయ్యారు. ఈ నెల15న కలెక్టర్ హరిచందన బదిలీ కాగా.. తాజాగా నిన్న జిల్లా ఎస్పీ చందనా దీప్తి కూడా బదిలీ అయ్యారు. చందనాదీప్తి స్థానంలో శరత్ చంద్ర పవార్‌ను జిల్లా ఎస్పీగా నియమించారు. హరిచందన స్థానంలో నారాయణ రెడ్డి బదిలీపై వచ్చారు.

నల్లగొండ మండల పరిధిలోని బాబాసాయిగూడెం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన యువకుడు తిరుమలగిరి సాగర్‌కు చెందిన బత్తుల పవన్‌గా గుర్తించారు. మృతి చెందిన మరో మహిళ వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.