Nalgonda

News April 13, 2024

NLG: అసెంబ్లీ వారీగా నియోజకవర్గాల ఎన్నికల సన్నాహక సమావేశాలు

image

నల్గొండ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సన్నాహక సమావేశాలు ఈనెల 13 నుంచి 22 వరకు జరుగుతాయని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13న దేవరకొండ, 16న మిర్యాలగూడ, 18న కోదాడ, 19న హుజూర్నగర్, 21న సూర్యాపేట, 22న నాగార్జునసాగర్ నియోజకవర్గాల సమావేశాలు సాయంత్రం 4 గంటలకు జరుగుతాయని తెలిపారు.

News April 13, 2024

నేటి నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలు

image

నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే ఎన్నికల సన్నాహక సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం రోజూ సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశాలను నిర్వహించబోతుంది. 13వ తేదీన దేవరకొండ, 16న మిర్యాలగూడ, 18న కోదాడ, 19న హుజూర్ నగర్, 20న సూర్యాపేట, 21న నల్లగొండ, 22న నాగార్జునసాగర్ నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహించనుంది.

News April 13, 2024

SRPT: ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్

image

ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. కోడేరు మండలం నాగులపల్లితండాకు చెందిన జ్యోతి(25) HYDలో జాబ్ చేస్తుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌కు చెందిన కారు డ్రైవర్‌ వీరబాబుతో 4ఏళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రులు కోరగా మొదట్లో అంగీకరించిన అతను నెలరోజులుగా కట్నం లేదా పొలం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఇంటికి వెళ్లిన యువతి మనస్తాపంలో ఉరేసుకుంది.

News April 13, 2024

NLG: భర్త మృతి తట్టుకోలేక ఆత్మహత్య

image

కోదాడ పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో భర్త మృతి తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నాగమణికి 8 నెలల కిందట వివాహమైంది. 2 నెలల కిందట గుండెపోటుతో భర్త మృతి చెందాడు. భర్త మృతి తట్టుకోలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కోదాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

News April 13, 2024

NLG: ఆరు నెలలుగా చక్కర పంపిణీ బంద్!

image

ఉమ్మడి జిల్లాలో అంత్యోదయ కార్డుదారులకు చక్కెర అందడం లేదు. ఆరు నెలలుగా చక్కెర పంపిణీని నిలిపివేసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆహార భద్రత కార్డుదారులకు గతంలో బియ్యం, చక్కెర, గోధుమలతో సహా తొమ్మిది రకాల వస్తువులు సరఫరా అయ్యేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆహార భద్రత కార్డులకు బియ్యం, అంత్యోదయ కార్డులకు బియ్యంతో పాటు చక్కెర మాత్రమే ఇస్తూ మిగతా వాటికి కోత పెట్టింది.

News April 13, 2024

తప్పుడు అఫిడవిట్‌ను సమర్పిస్తే చర్యలు: SP

image

నామినేషన్ సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్ధులు, ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ను సమర్పిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పోటీ చేసే అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్ ను సమర్పించడం, అఫిడవిట్‌లో కొంత సమాచారాన్ని దాచిపెట్టి అఫిడవిట్ ను సమర్పించడం నేరంగా పరిగణించబడుతుందని ఎస్పీ వెల్లడించారు.

News April 12, 2024

NLG: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ప్రయాణీకులు కొన్నిసార్లు రైలు పైకప్పు, స్టెప్ (ఫుట్ బోర్డ్) మీద ప్రయాణిస్తున్నారని… రైలు పైకప్పు, మెట్టు లేదా ఇంజిన్ పై ప్రయాణించడం ప్రమాదకరం, సురక్షితం కాదు… చట్టవిరుద్ధమని గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకుల ఉపయోగం కోసం ఉద్దేశించబడని రైలు పైకప్పు, మెట్టు లేదా ఇంజిన్ పై ప్రయాణించే ప్రయాణీకులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు.

News April 12, 2024

NLG: అప్రకటిత కోతలతో ఇక్కట్లు..

image

నల్గొండ జిల్లా కేంద్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గంటల తరబడి కరెంట్ తీసేస్తుండటంతో ఇళ్ల నుంచి పని (వర్క్ ఫ్రం హోం) చేస్తున్న పలువురు ఉద్యోగులు అవస్థలు పడ్డారు. ఆయా షిప్టు సమయాల్లో విద్యుత్ ఉండకపోవడంతో అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందని చెబుతున్నారు. అలాగే అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోతుండటంతో ఒత్తిడి పెరుగుతోందన్నారు.

News April 12, 2024

ధాన్యం రైతులను ఇబ్బందుల గురిచేస్తే చర్యలు తప్పవు: ఎస్పీ  

image

 రైతుల వరి ధాన్యం కొనుగోలు విషయంలో తరుగుల పేరిట ఇబ్బందులకు గురి చేసిన, మద్దతు ధరకు కంటే తక్కువ చెల్లించిన మిల్లర్ల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందన దీప్తి హెచ్చరించారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఐకెపి, సొసైటీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయు రైస్ మిల్లర్లు ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.

News April 12, 2024

సూర్యాపేట: 10 రోజులలో 12 మంది ‌మృతి

image

సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని హైదరాబాద్ – విజయవాడ హైవేపై ఈ 10 రోజుల కాలంలో 12 మంది రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈనెల 4న ఇద్దరు చిన్నారులు ,ఇద్దరు ఉపాధ్యాయినీలు, మరో వృద్ధురాలు చనిపోయిన విషయం తెలిసిందే. ఈనెల 8న ఓ యువకుడు, ఈ నెల 10న ఓ యువకుడి, ఈనెల 11న ఆరుగురు యువకులు ఇదే జాతీయ రహదారి 65 మృతి చెందారు. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.