India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయంలో శుక్రవారం నీటి నిల్వల సమాచారం ఇలా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 510.30 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 132.18020 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత సంవత్సరం ఇదే సమయంలో 527.10 అడుగులు, 164.09 క్యూసెక్కుల నీటి నిల్వ ఉంది. ఇక ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 7,370 క్యూసెక్కులుగా ఉంది.
తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకుడు గుంతలపై దృష్టి పెట్టింది. ఇటీవల హైకోర్టు సైతం ఇంకుడు గుంతలు తప్పని సరిగా తీయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో 350 గజాలు దాటిన ప్రతి భవనం, అపార్ట్మెంట్స్, ఫంక్షన్ హాల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు వాణిజ్య సముదాయాల్లో తప్పని సరిగా ఇంకుడు గుంతలు తీయించాలని ప్రభుత్వం మున్సిపల్ అధికారులను ఆదేశించింది.
ఎన్నికల సంఘం రూపొందించిన నియమావళిని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా SP రాహుల్ హెగ్డే హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో MCC కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు రాజకీయ నాయకుల కార్యకలాపాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధం. నేరేడుచర్లకి చెందిన అధికార పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పాలకీడు కానిస్టేబుల్ చింతలచెరువు విష్ణును సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
సూర్యాపేట జాతీయరహదారిపై బ్రిడ్జి వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డీసీఎంను కారు వెనుకనుంచి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతులు నవీద్ (25), నిఖిల్ రెడ్డి (25), రాకేష్ (25)గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడ్డ మరో వ్యక్తి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుండి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా రూ.1.71 లక్షల నగదు, రూ. 7.75 వేల విలువ గల మద్యం, 20, 000 విలువగల గంజాయి, రూ. 1.14 లక్షల విలువగల ఆభరణాలు, 86 లక్షల విలువగల ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో 75 లక్షల విలువగల మద్యం సీజ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం రూ.4.55 కోట్లు సీజ్ చేశామన్నారు
ఉమ్మడి జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో NLG, SRPT, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రధ్ధలతో ప్రార్ధనలు చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా మసీదుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఉమ్మడి జిల్లాలోని మహాత్మాజ్యోతిరావుపూలే బీసీ గురుకుల జూనియర్ బాలికల, బాలుర కళాశాలలు, డిగ్రీ మహిళా, పురుషుల కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల విద్యాలయాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రవేశపరీక్ష ద్వారా సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు http///www.mjptbcwreis. telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. నలగొండ, భువనగిరి ఎంపీ స్థానాలకు లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నూతన ఓటు నమోదు, జాబితాలో మార్పులకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు గడువు విధించింది. ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 4రోజుల సమయం ఉంది. ఈ నెల 25న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.
సూర్యాపేట మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రాయినిగూడెం గ్రామం వద్ద స్కూటీని తప్పించబోయిన ఎర్టీగా వాహనం చెట్టును ఢీ కొట్టడంతో స్పాట్‌లో ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించిన నాగార్జునసాగర్ అడుగంటుతోంది. డెడ్ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్ బెల్స్‌ను మోగిస్తోంది. సాగర్ కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్ జంట నగరాలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి గండం పొంచి ఉంది. ఇప్పటికే ఈ ఆయకట్టు పరిధిలో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు తాగునీటి కష్టాలు కూడా పొంచి ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.