Nalgonda

News April 10, 2024

సూర్యాపేట: ఒకే కొమ్మకు 55 మామిడి కాయలు

image

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 55 మామిడి కాయలు ఒకే చోట కాశాయి. అది కూడా విరిగిపోయి ఎండినదనుకున్న కొమ్మకు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన మోదాల గంగయ్య పొలంలో విరిగిపోయి ఎండిపోయిందనుకున్న మామిడి చెట్టు కొమ్మ చిగురించింది. ఆ చిగురే మామిడి కాయల రూపంలో ప్రతిఫలిచింది. ఏకంగా 55 ఒకే చోట కాసి చూపరులను ఆకట్టుకుంటోంది.

News April 10, 2024

నల్గొండ: నాలుగేళ్ల చిన్నారి నాలెడ్జ్ అదుర్స్

image

చిట్యాలకు చెందిన నాలుగున్నరేళ్ల గంజి తక్ష్వి తన ప్రతిభలో మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారి ఏమాత్రం తడుముకోకుండా రాష్ట్ర రాజధానుల పేర్లు చెబుతోంది. రెండు రోజుల్లోనే నేర్చుకుందన్నారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రులు, జాతీయ పక్షులు, జంతువుల పేర్లు నేర్పించాలని సంకల్పంగా పెట్టుకున్నామన్నాని పాప తల్లిదండ్రులు చెబుతున్నారు.

News April 10, 2024

NLG: గ్రామాల్లో ప్ర’జల’ కష్టాలు..!?

image

ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. అసలే కరువు, ఆపై ఎండలు ముదిరిపోవడంతో భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లాయి. దీంతో గ్రామ పంచాయతీల్లో బోర్లు ఎండిపోయాయి. మరోవైపు ఎప్పుడు వస్తాయో తెలవని భగీరథ నీళ్ల కోసం జనాలు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలన్నారు.

News April 10, 2024

నల్గొండ: సూపర్బ్.. 40 ఏళ్లుగా దాహార్తిని తీరుస్తున్న బావి

image

నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడులోని మేడిబావి 40ఏళ్లుగా ప్రజల దాహార్తిని తీరుస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయి మోటార్లు పనిచేయకపోయినా ఈ బావిలో మాత్రం సమృద్ధిగా నీరు లభిస్తుండటంతో గ్రామంలో పలు కాలనీలకు వేసవిలో నీటి ఎద్దడి తప్పింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచి నాంపల్లి రాములు 50ఏళ్ల క్రితం తన వ్యవసాయ అవసరాల నిమిత్తం తన భూమిలో బావిని తవ్వించారు.

News April 10, 2024

నల్గొండ: కొండెక్కిన చికెన్ ధరలు

image

రోజురోజుకూ కోడిమాంసం వెల కొండెక్కుతోంది. మొన్నటి వరకు కిలో రూ.200 పలికిన చికెన్‌ ధర నేడు రూ.294కు చేరింది. దీంతో దుకాణానికి వెళ్లిన వారు ధర అడిగి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కిలో తీసుకునే వారు ఇప్పుడు ధరను చూసి అరకిలో తోనే పరిమితమవుతున్నారు. మున్ముందు చికెన్ ధరలు రూ.300పైగా చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

News April 10, 2024

సూర్యాపేట: వ్యవసాయ మార్కెట్‌కు రెండురోజులు సెలవు

image

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 11, 12న రెండురోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి రాహుల్ మంగళవారం తెలిపారు. ఈనెల 11న గురువారం రంజాన్, 12న శుక్రవారం సెలవు ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 13న మార్కెట్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 9, 2024

రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నాయకుడికి గాయాలు

image

తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌కు మంగళవారం మధ్యాహ్నం కొత్తపేట వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రవికుమార్ స్వల్పగాయాలతో బయట పడ్డారు. మిత్రుడిని పరామర్శించి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు టైరు కొత్తపేట క్రాస్ రోడ్ సమీపంలో పగిలిపోవడంతో అదుపు తప్పి డివైడర్, మెట్రో రైలు పిల్లర్ గుద్దుకోవడంతో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది.

News April 9, 2024

యాదాద్రి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

తుర్కపల్లి మండలం ములకలపల్లి శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. భువనగిరి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాజమణి ఈ ప్రమాదంలో మృతి చెందారు. డొంకేన రాములు, రాజమణి దంపతులు ద్విచక్ర వాహనంపై తుర్కపల్లికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. రాజమణి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News April 9, 2024

సాగర్ ప్రాజెక్ట్ సమాచారం

image

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మంగళవారం ఉదయం సమాచారం మేరకు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.10 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను ప్రస్తుతం 133.5447 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి 6,498 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉండగా, ఇన్ ఫ్లో నిల్ ఉంది.

News April 9, 2024

రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దు: మంత్రి కోమటిరెడ్డి

image

RRR నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ రోజు RRR నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల 500 మంది రైతులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అలైన్మెంట్ మార్చాలని మంత్రిని కోరగా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తామని అప్పటిలోగా రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు.