India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మిర్యాలగూడలో వడదెబ్బ కారణంగా సోమవారం ఒక్కరోజే ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ప్రకాష్ నగర్ తొమ్మిదో వార్డుకు చెందిన శ్యామల పెంటయ్య(70), బండి అడవయ్య (65) ఎండ తీవ్రతకు అవస్థతకు గురై చనిపోయారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయని చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
సూర్యాపేట మానసనగర్ వద్ద జరిగిన <<12992243>>రోడ్డు ప్రమాదంలో<<>> మృతుల సంఖ్య ఐదుకు చేరింది. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న మోక్షిత్ (7) ఇవాళ మృతిచెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి(ఎంబావి)లో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఓ దుండగుడు జక్క నిర్మల అనే మహిళ మెడలోంచి పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. ఘటనలో మహిళ మెడకు గాయాలు కూడా అయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక నిఘా పెడుతున్నప్పటికీ చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతుండడంతో ప్రజలు భయపడుతున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన వంద మంది మైనారిటీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ, సీఎస్ఏటీలో రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33 శాతం, దివ్యాంగులకు ఐదు శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. అభ్యర్థులు ఈ నెల 22 వరకు www.tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈనెల 6న తుంగతుర్తిలో సమావేశం నిర్వహించగా, సోమవారం మునుగోడు అసెంబ్లీ పరిధిలో సన్నాహక సమావేశం నిర్వహించింది. రేపు ఉదయం SRPTలో సమావేశం నిర్వహించనుంది. 12న ఉదయం కోదాడ, మధ్యాహ్నం HZNRలో, 13న ఉదయం NKL, మధ్యాహ్నం ఆలేరు సమావేశాలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 11 నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టబోతోంది . NLG, BNG పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొననున్నారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు.
ఓటర్లకు ఎన్నికల సంఘం స్మార్ట్ కార్డు తరహాలో ఫొటో గుర్తింపు కార్డులను అందిస్తోంది. జిల్లాలో కొత్తగా ఓటరు నమోదు చేసుకున్న వారితో పాటు అడ్రస్, పేర్లలో మార్పులు, చేర్పులు చేసుకున్న వారికి కూడా ఈ కొత్త ఎపిక్ కార్డులను పంపిణీ చేయనున్నారు. జిల్లాకు 1.12 లక్షలు కొత్త ఫొటో గుర్తింపు కార్డులు వచ్చాయి. వాటన్నింటిని ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఆలయంలోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ ఏప్రిల్ 8న ఉత్తర్వులు జారీచేసింది. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహించే మినిస్టీరియల్ సిబ్బంది, మతపర సిబ్బంది, నాల్గో తరగతి సిబ్బంది, ఎస్పీఎఫ్, హోంగార్డ్స్, అవుట్ సోర్సింగ్, సిబ్బంది వారి సెల్ ఫోన్లు ఆలయంలోకి తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
మద్యం మత్తులో డీసీఎం వాహనం నడిపి ముగ్గురి మృతికి కారణమైన మహమ్మద్ అప్సర్ పాషాకు పది సంవత్సరాల క కఠిన కారాగార శిక్ష రూ. 2 వేలు జరిమాన విధిస్తూ భువనగిరి జిల్లా మొదటి అదనపు కోర్టు తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. 2022లో భువనగిరి శివార్లలో టేకులసోమారం గ్రామస్థులు నర్సింహ్మ, రాజ్యలక్ష్మి, జంగమ్మ అనే ముగ్గురు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మృతి కేసులో అప్సర్ పాషాకు జైలు శిక్ష విధించారు.
విద్యార్థినులు, మహిళలు ఫేస్ బుక్, వాట్స్‌అప్, ఇన్‌స్టాగ్రామ్‌ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని జిల్లా SP చందన దీప్తి సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, మహిళా రక్షణ కోసం పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పోలీస్ శాఖ మహిళా భద్రతకు పటిష్ఠమైన నిఘా పెట్టిందన్నారు.
Sorry, no posts matched your criteria.