India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించిందని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఓటు హక్కు ప్రాధాన్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు సాక్ష్యం యాప్ ద్వారా, అలాగే ఫారం 12-డిలో హోమ్ ఓటింగ్‌కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను RTC కార్గో ద్వారా రూ.151 చెల్లిస్తే భక్తుల ఇండ్ల వద్దకు చేరుస్తామని ఉమ్మడి నల్లగొండ రీజినల్ మేనేజర్ ఎస్. శ్రీదేవి తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. ప్రజలు తమ దగ్గరలో వున్న టీఎస్ RTC లాజిస్టిక్స్ లో రూ. 151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు క్రోధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
ఓ వైపు సాగు నీటి కొరత.. మరో వైపు దంచికొడుతున్న ఎండలు కూరగాయలు సాగు చేసే రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయాలుగా ఉన్న పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమయ్యాయి. గత వేసవి కంటే ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో పాటు నీటి వనరులు ఎండిపోవడంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. బోరుబావులపై ఆధారపడి కూరగాయల సాగు ప్రారంభించినా ఎండ తీవ్రతతో నీరు అందక మధ్యలోనే పంటలను వదిలేస్తున్నారు.
వందరోజుల కాంగ్రెస్ పాలనలో 2014కి ముందు ఉన్న దుర్భర పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కరవు తాండవిస్తుందని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇంతవరకు స్పందన లేదన్నారు. కేసీఆర్‌ను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదన్నారు.
తిరుమలగిరి మండలం జేత్యా తండాకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఎర్రం శెట్టి యాదగిరి కుమారుడు అవినీవేశ్ (10) బ్రెయిన్ డెడ్‌తో మృతిచెందాడు. మండల విద్యాధికారి శాంతయ్య, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలుడు మృతి చెందడం బాధాకరమన్నారు.
చిట్యాలలో శనివారం జరిగిన పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సమీపంలోని ఓ ఇంటిలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. గుంటూరుకు చెందిన బాణసంచా తయారీ కేంద్రం నిర్వహకుడు కోటేశ్వరరావు పేలుడులో తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. నల్గొండలోని హైదరాబాద్ రోడ్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. అంతేకాకుండా.. దాదాపు 40 మంది మహిళల వ్యక్తిగత సంభాషణలు విని వారిని బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు వెల్లడైంది.
నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఆదివారం నీటిని నిలిపివేశారు. ఈనెల 1వ తేదీ నుంచి వారం రోజులపాటు కాలువకు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టు పరిధిలోని తాగునీటి కోసం పెద్దదేవులపల్లి చెరువుతోపాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నింపేందుకు వారం రోజుల్లో 2.23 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు 1-9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్-2) జరగనున్నాయి. వాస్తవానికి ఈ నెల 8 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. వివిధ సంఘాల, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు పరీక్షలను 15 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేసింది.
నల్గొండలో గత ప్రభుత్వం రూ.74 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ టవర్ అలంకారప్రాయంగా మారింది. ఐటీ హబ్ నిర్మాణంతో నిరుద్యోగులు సంబర పడిపోయారు. మహానగరాలకు వెళ్లకుండానే స్థానికంగా సాఫ్ట్‌వేర్ కొలువులు లభించనున్నాయని సంతోషపడ్డారు. కానీ.. నేడు కంపెనీలు ముందుకు రాక, ఉద్యోగుల సందడిలేక హబ్ వెలవెలబోతోంది. గతంలో 360 మంది అభ్యర్థులను ఎంపిక చేసుకుని ప్లేస్‌మెంటు ప్రకటన కాగితాలకే
పరిమితమైంది.
Sorry, no posts matched your criteria.