India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యవస్థను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ఈ సారి కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. పౌరసరఫరాల శాఖ ఐరిస్ విధానం తీసుకొచ్చారు. గతంలో ఆధార్ అనుసంధానం, ఓటీపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేసే వారు. తాజాగా ఓటీపీతో పాటు ఐరిస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ధాన్యం విక్రయించే రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి రావాల్సి ఉంది.
జిల్లాలో దొంగతనాల నివారణకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య కూడళ్లు, నివాసాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేసవి సెలవుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లే వారు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిం చారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ముగిసేవారు వరకు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరగదని తెలిపారు.
జిల్లాలో భానుడు ప్రతాపం తగ్గడం లేదు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం జిల్లాలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిడమనూరు మండలంలో 44.5 డిగ్రీలు, అత్యల్పంగా చింతపల్లి మండలంలో వడకొండ గ్రామంలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలు మండుతుండడంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చేందుకు జనం జంకుతున్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ (2014,2019) MP స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2014లో గుత్తా సుఖేందర్ రెడ్డి హస్తం పార్టీ నుంచి గెలిచి తర్వాత కారెక్కారు. 2019లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా గెలిచి కాంగ్రెస్ హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి. కాగా ఇక్కడ కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి, BJPనుంచి సైదిరెడ్డి, BRS నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో చికెన్ ధరలు కొండెక్కాయి. ముక్కలేనిదే ముద్ద ముట్టని చికెన్ ప్రియులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. వారం క్రితం రూ.200 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ. 100 పెరిగి రూ.300కు చేరుకుంది. దీంతో చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు.
BJPలో చేరేందుకు పిల్లి రామరాజు యాదవ్ రంగం సిద్ధం చేసుకున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. ఇటీవల తన రాజకీయ భవిష్యత్తుపై తమ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అధిష్ఠానంతో జరిపిన చర్చలు సఫలం అవడంతో ఈనెల 9న BJPలో చేరే అవకాశం ఉన్నట్లు స్థానిక నేతలు అంటున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గం పర్యటనలో కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ ఇప్పుడు ప్రజలనుమోసం చేసేందుకు పొలంబాటతో వస్తున్నారని విమర్శించారు. శవాల మీద పేలాలు ఏరుకునే కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని అన్నారు.
ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు IPL చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్ దుర్మార్గపు పాలన ఉందన్నారు.
రామన్నపేట మండలం మునిపంపుల తన సొంత గ్రామంలో భువనగిరి సీపీఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఓ వృద్ధురాలు తన పెన్షన్ డబ్బులను పోటీలో నిలిచేందుకు నామినేషన్ వేయడానికి తన పెన్షన్ డబ్బులను విరాళంగా అందజేశారు. పార్టీలకు అతీతంగా సీపీఎం పార్టీకి ఓటు వేసి గెలిపించుకుంటామని గ్రామస్తులు ధీమా వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.