India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిట్యాల మున్సిపాలిటీలోని సంతోష్ నగర్ కాలనీలో బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ డీఎస్సీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్దికాలంగా ఎలాంటి అనుమతి లేకుండా ఓ ఇంటిని కిరాయికి తీసుకొని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన కోటేశ్వరరావు బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
మర్రిగూడ మండలంలోని ఆదర్శ పాఠశాలలో 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతి, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 7న ఆన్ లైన్‌లో పరీక్ష ఉంటుందని తెలిపారు. అదే రోజు ఉదయం 10గం.ల నుంచి 12గం.ల వరకు 6వ తరగతికి, మధ్యాహ్నం 2గంల నుంచి 4గం.ల వరకు 7- 10వ తరగతుల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ స్వరూప రాణి తెలిపారు.
భువనగిరి మున్సిపాలిటీ టీచర్స్ కాలనీ సమీపాన రైల్వే ట్రాక్ పై రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. మున్సిపాలిటీలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన తెల్జీరి చిన్న యాదవ్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లుగా రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
నేరెడుచర్లలో ఆత్మీయులు పట్టించుకోకపోవడంతో వృద్ధురాలు అనాథలా మృతి చెందింది. విద్యానగర్లో చెట్టుకింద జీవనం సాగిస్తున్న సైదమ్మ(80) అనే వృద్ధురాలు ఎండ తీవ్రతకు తట్టుకోలేక అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన స్థానికులు 108 ద్వారా హూజూర్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సైదమ్మ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో గంజాయి విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. గుగులోతు విజయ అనే మహిళ గంజాయి తాగుడుకు అలవాటైంది. ఇదే క్రమంలో డబ్బు సంపాదనకు గంజాయి విక్రయిస్తోంది. చింతలపాలెం బస్టాండులో విజయను అరెస్టు చేసినట్లు ఎస్సై సైదిరెడ్డి తెలిపారు. ఆమె వద్ద 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రాపురం గ్రామానికి చెందిన చంద్రమౌళి బీపీ, షుగర్‌తో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగాడు. చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కాంగ్రెస్ పార్టీ మీద అభిమానాన్ని తన కూతురి పేరులో చూపెట్టాడు పాలకీడు మండలం శూన్యంపాడులోని ఓ కార్యకర్త. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అదే సంవత్సరంలో కూతురు పుట్టడంతో బాలికకు రమావత్ కాంగ్రెస్ అని పేరుపెట్టాడు. అనంతరం కాంగ్రెస్ మీద అభిమానంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం అందించే ఏ సాయాన్ని కూడా తీసుకోకపోవడం గమనార్హం.
కరెంట్ షాక్‌తో కూలీ మృతి చెందిన ఘటన కోదాడ మండలం నల్లబండగూడెం శివారులో జరిగింది. రెడ్ల కుంటకు చెందిన మహమ్మద్ అబ్దుల్ హలీం విద్యుత్ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ఇంటి పైనుంచి 11 కేవీ వైర్ వెళ్లిన విషయం గమనించకుండా అల్యూమినియం బద్దెలు ఎత్తుతుండగా అవి విద్యుత్ తీగల తగిలి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.
పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వేగవంతమైంది. ఈనెల 3న నల్లగొండలో మూల్యాంకనం ప్రారంభించగా విధులు కేటాయించిన ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. దీంతో విద్యాశాఖ నోటీసులు జారీ చేయడంతో శుక్రవారం అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరయ్యారు. సెలవు దినాల్లోనూ మూల్యాంకనం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పోలీసుల పాత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. జిల్లాకు చెందిన ఓ సీఐని విచారించగా, నల్గొండలో వార్ రూం ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులో తీసుకున్నారు. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఇంకా ఎవరెవరు బయటకొస్తారోనన్న ఉత్కంఠ ఉంది.
Sorry, no posts matched your criteria.